Homemain slidesAgnipathVayu: అగ్నివీరులకు శుభవార్త.. భారీగా ఉద్యోగాల భర్తీ

AgnipathVayu: అగ్నివీరులకు శుభవార్త.. భారీగా ఉద్యోగాల భర్తీ

భారత్ సమాచార్. నెట్, న్యూఢిల్లీ: అగ్నిపథ్ పథకంలో చేరాలనుకునే మ్యుజీషియన్లకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన భారత వాయుసేన అగ్నిపథ్‌ పథకంలో భాగంగా.. అగ్నివీర్‌ వాయు (మ్యుజీషియన్‌) నియామకాల ప్రకటన విడుదల చేసింది. ఈ పోస్టుకు దరఖాస్తు చేసేందుకు భారతీయ శాస్త్రీయ వాద్యాల్లోని ఏదైనా ఒక దాంట్లో నైపుణ్యం ఉండాలి. గుర్తింపు పొందిన పాఠశాల/ బోర్డు నుంచి మెట్రిక్యులేషన్‌/ టెన్త్‌ లేదా తత్సమాన విద్యార్హత ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు. నిర్దిష్ట శారీరక / వైద్య ప్రమాణాలు, సంగీతానుభవ సర్టిఫికెట్‌ తప్పనిసరి. ఈ పోస్టుకు దరఖాస్తు చేసుకునే వారు 01-01-2005 నుంచి 01-07-2008 మధ్య జన్మించివుండాలి.

మొదటి ఏడాది రూ.30,000, రెండో ఏడాది రూ.33,000; మూడో ఏడాది రూ.36,500; నాలుగో ఏడాది రూ.40,000 జీతంగా ఇస్తారు.మ్యూజిక్ ఇన్‌స్ట్రుమెంట్స్‌ ప్రొఫిషియన్సీ టెస్ట్‌, ఇంగ్లిష్‌, అడాప్టబిలిటీ టెస్ట్‌, ఫిజికల్‌ ఫిట్‌నెస్‌ టెస్ట్‌, మెడికల్‌ ఎగ్జామినేషన్‌, డాక్యుమెంట్స్‌ వెరిఫికేషన్‌ల ఆధారంగా ఎంపిక ఉంటుంది. రిజిస్ట్రేషన్‌ ఫీజు: రూ.100. కాగా.. 21-04-2025 తేదీతో ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ ప్రారంభంకాగా..11-05-2025 ముగుస్తుంది. రిక్రూట్‌మెంట్‌ ర్యాలీ షెడ్యూల్‌ జూన్‌ 10 నుంచి 18 వరకు ఉంటుంది. 2 ఏఎస్‌సీ సీ/ఓ రేస్‌ కోర్స్‌ క్యాంప్‌, ఎయిర్‌ ఫోర్స్‌ స్టేషన్‌ న్యూ ఢిల్లీ (న్యూఢిల్లీ), 7 ఏఎస్‌సీ, నెం.1 కబ్బన్‌ రోడ్‌, బెంగళూరు (కర్ణాటక) ప్రాంతాల్లో ర్యాలీ నిర్వహిస్తారు. మరిన్ని వివరాలను https://agnipathvayu.cdac.in/AV/ వెబ్ సైట్ లో చూడొచ్చు

RELATED ARTICLES

Most Popular

Recent Comments