భారత్ సమాచార్.నెట్, హైదరాబాద్: ఆర్టీసీ క్రాస్ రోడ్డులోని సంధ్య థియేటర్ ఘటన విషయంలో ప్రముఖ నటుడు అల్లు అర్జున్‌పై సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ ఆరోపణలపై అల్లు అర్జున్ స్పందించారు. ప్రెస్ మీట్‌లో ఆయన మాట్లాడుతూ.. తనపై చేసిన ఆరోపణలు అన్ని పూర్తిగా అవాస్తవమన్నారు. ఆ రోజు థియేటర్లో ఉన్న తన దగ్గరికి ఏ పోలీసు రాలేదని.. వచ్చి తనకు ఏం చెప్పలేదని.. థియేటర్ వద్ద తాను ఎలాంటి రోడ్ షో చేయలేదని అన్నారు.
అల్లు అర్జున్‌ను చూస్తుంటే బాధగా ఉంది:
అదే ప్రెస్ మీట్ లో నిర్మాత అల్లు అరవింద్ సైతం స్పందించారు. తన కుమారుడి వ్యక్తిత్వాన్ని తక్కువ చేసి మాట్లాడటం తట్టుకోలేకపోతున్నామని అన్నారు. రేవతి కుటుంబం విషయంలో న్యాయవాదుల సూచన ప్రకారమే బన్నీ మాట్లాడుతున్నాడని అన్నారు. ఇంత సక్సెస్ అయినా తన అభిమానుల ఫ్యామిలీకి ఇలా కావడంతో చాలా బాధపడుతున్నాడు. నా కొడుకును అలా చూస్తుంటే బాధగా ఉంది. ఈరోజు కొన్ని అబద్ధపు ఆరోపణలు రావడంతో క్లారిటీ ఇవ్వాలి అనుకున్నాము. అందుకే ప్రెస్ మీట్ పెట్టినట్లు పేర్కొన్నారు. “పుష్ప 2తో ఇండియన్ సినిమా రికార్డ్స్ అన్నీ బ్రేక్ చేసినా.. ఫ్యాన్స్ తనను ఎలా రిసీవ్ చేసుకున్నారనే చూసుకునే అదృష్టం అల్లు అర్జున్ కు లేకుండా పోయింది. ఇంత పెద్ద సినిమా తీసి.. రికార్డ్స్ క్రియేట్ చేసిన నా కొడుకు రెండు వారాలుగా ఈ గార్డెన్ లోనే ఓ మూలన కూర్చుంటున్నాడు. న్యాయపరమైన సమస్యలు ఎదురవుతాయనే ఉద్దేశంతోనే మీ ప్రశ్నలకు అల్లు అర్జున్ సమాధానం చెప్పకుండానే వెళ్లిపోయారు. 22 ఏళ్లు కష్టపడి ఈ పేరు సంపాదించుకున్నాడు. ఇదంత ఒక రాత్రి, ఒక సినిమా, ఒక ప్రెస్ మీట్ లో రాలేదు. మూడు తరాలుగా మా కుటుంబం గురించి తెలుసు. ఇలా వ్యవహరించామా ? మీ కళ్ల నుంచి తప్పించుకుని ఇన్నేళ్లు ఉండగలమా ? మాపై అసత్య ప్రచారాలు చూస్తుంటే బాధగా ఉంది అని అల్లు అరవింద్ అన్నారు.
మరిన్ని వార్తలు: