HomeUncategorizedతెలంగాణలో మెగా డీఎస్సీ ప్రకటన

తెలంగాణలో మెగా డీఎస్సీ ప్రకటన

భారత్ సమాచార్, జాబ్స్ అడ్డా ; తెలంగాణలో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నేడు విడుదల చేసింది. మొత్తం 11,062 ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం అధికార కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ డీఎస్సీ నోటిఫికేషన్ ను ప్రకటించింది. ఇందులో వివిధ కేటగిరీల కింద పోస్టుల్ని భర్తీ చేయనున్నట్టు అధికారులు వెల్లడించారు. ఈ మేరకు అధికారిక వెబ్ సైట్ లో అన్ని వివరాలను పొందు పర్చినట్లు ప్రభుత్వం వెల్లడించింది. గతంలో ప్రకటించిన డీఎస్సీ నోటిఫికేషన్ ను తాజాగా రద్దు చేసిన ప్రభుత్వం.. శాఖల వారీగా కొన్ని పోస్టులను పెంచి, నోటిఫికేషన్ ను అప్ గ్రేడ్ చేసి దీన్ని విడుదల చేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన నివాసంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, విద్యాశాఖ అధికారులతో కలిసి మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ను విడుదల చేశారు. ఇవాళ తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన డీఎస్సీ నోటిఫికేషన్ ప్రకారం మొత్తం 11062 పోస్టులు భర్తీ చేయనున్నారు. గతంలో ప్రకటించిన 5089 పోస్టులకు కొత్తగా 5973 పోస్టులు కలిపి మొత్తం 11062 పోస్టులకు ఇవాళ నోటిఫికేషన్ విడుదల చేశారు.
ఇందులో ఎస్జీటీ పోస్టులు 6508
ఎస్జీటీ స్పెషల్ ఎడుకేషన్ పోస్టులు 796
భాషా పండిట్ల పోస్టులు 727,
పీఈటీ పోస్టులు 182
స్కూల్ అసిస్టెంట్ పోస్టులు 2629
స్కూల్ అసిస్టెంట్ స్పెషల్ ఎడ్యుకేషన్ పోస్టులు 220 పోస్టులు ఉన్నాయి.
గతంలో డీఎస్సీకి దరఖాస్తు చేసుకున్న వారు మరోసారి దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదని అధికారులు వెల్లడించారు.

మరికొన్ని కథనాలు…

నిరుద్యోగులకు గుడ్ న్యూస్..రైల్వేలో 4,660 ఉద్యోగాలు

 

RELATED ARTICLES

Most Popular

Recent Comments