Homemain slidesగుంపు మేస్త్రీ నుంచి మరో ఆణిముత్యం..’’ అంటూ ట్రోలింగ్

గుంపు మేస్త్రీ నుంచి మరో ఆణిముత్యం..’’ అంటూ ట్రోలింగ్

భారత్ సమాచార్, రాజకీయం : ప్రస్తుత సోషల్ మీడియా సమరంలో నేతలు ఎక్కడ దొరికిపోతారా? ఏ మాట వదిలేస్తారా? అని ప్రత్యర్థి పార్టీలు చూస్తుంటాయి. గత ఎన్నికలకు ముందు రేవంత్ రెడ్డి..ఓ ఇంటర్వ్యూలో చెప్పిన విషయాలను తెగ ట్రోల్ చేశాయి. ఇంతకీ అందులో ఏముందంటే.. ‘‘మీకు పరిపాలనలో అనుభవం లేదు కదా.. సీఎం పదవి వస్తే ఎలా పాలిస్తారు?’’ అని యాంకర్ ..రేవంత్ రెడ్డిని అడుగుతుంది. దానికి రేవంత్ రెడ్డి ‘‘ సీఎం పదవి అనేది గుంపు మేస్త్రీ లాంటి పనే. గుంపు మేస్త్రీ అందరికీ పనులు అప్పజెప్పి ఒక భవనాన్ని ఎలా కడుతాడు.. ఇక సీఎం పదవి కూడా అలాంటిదే. అధికారులు, మంత్రులతో కలిసి ఆ పనిని పూర్తిచేస్తాం. ఒక ఇల్లు కట్టడమైనా, ప్రభుత్వ కార్యక్రమం అయినా ఒకలాంటిదే. ’’ అని సమాధానం చెప్పాడు. దీన్ని అప్పట్లో బీఆర్ఎస్ ,బీజేపీలు విపరీతంగా ట్రోల్ చేశాయి..

తాజాగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి దావోస్ పర్యటనకు వెళ్లారు. గత ప్రభుత్వంలో వరుసగా కేటీఆర్ వెళ్లేవారు. ఆయన జాతీయ, అంతర్జాతీయ మీడియాతో పాటు ప్రపంచ స్థాయి నేతలతో సమానంగా ఆయన ప్రసంగించేవారు. ఇంటర్వ్యూలు ఇచ్చేవారు. ఇక సీఎం రేవంత్ రెడ్డిని ఓ చానల్ ఇంటర్వ్యూ చేసింది..

రిపోర్టర్: గత తెలంగాణ ప్రభుత్వం(బీఆర్ఎస్) ప్రత్యేకంగా సాంకేతికత మరియు తయారీ రంగంలో కూడా గణనీయమైన పెట్టుబడులు పెట్టింది. కాబట్టి మీరు పెట్టుబడులకు ఎంత భిన్నంగా ఉన్నారు. మీ ప్రభుత్వం దృష్టి కేంద్రీకరించే ప్రాంతాలు ఏమిటి?

రేవంత్ రెడ్డి: పెట్టుబడి దారులు స్పోర్ట్స్ కార్ల వంటివారు. ప్రభుత్వం రోడ్డు వంటిది. మేము వేగానికి అడ్డంకులను సృష్టించలేం. కాబట్టి నేను టేబుల్ నుంచి క్లియర్ చేయబోతున్నాను. ఎలాంటి అనుమతులు మరియు అగ్రిమెంట్లు ఉన్నా మా ప్రాతిపదికన తీసుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. కాబట్టి మా ప్రభుత్వానికి, గత ప్రభుత్వానికి ఉన్న తేడా ఇదే.

కాగా, ఈ వీడియోను బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు విపరీతంగా ట్రోల్ చేస్తున్నాయి. కంపెనీలను స్పోర్ట్స్ కార్లతో, ప్రభుత్వాన్ని రోడ్లతో పోలుస్తూ రేవంత్ చెప్పిన కొత్త భాష్యాన్ని ‘‘గుంపు మేస్త్రీ నుంచి మరో ఆణిముత్యం..’’ అంటూ ట్రోలింగ్ చేస్తున్నాయి.

మరికొన్ని రాజకీయ విశేషాలు…

ఆ యూట్యూట్ ఛానళ్లపై క్రిమినల్ కేసులు పెడతాం: కేటీఆర్

RELATED ARTICLES

Most Popular

Recent Comments