Homebreaking updates newsఆ వాట్సాప్ గ్రూపులన్నీ తొలగించండి

ఆ వాట్సాప్ గ్రూపులన్నీ తొలగించండి

భారత్ సమాచార్, అమరావతి ;

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల వివరాల సమాచారం క్షణాల్లో ప్రజలందరికీ తెలియజేసేందుకు ఏర్పాటు చేసిన వలంటీర్ల వాట్సాప్, టెలిగ్రాం తదితర గ్రూపులన్నింటినీ తక్షణమే తొలగించాలంటూ గ్రామ వార్డు సచివాలయాల శాఖ డైరెక్టర్ శివ ప్రసాద్ అన్ని జిల్లాల కలెక్టర్లకు తాజాగా ఆదేశాలు ఇచ్చారు. ఈ మేరకు అధికారులు ఆదేశాలు జారీ చేశారు. తమ ఆదేశాలు తక్షణం క్షేత్ర స్థాయిలో అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని కలె క్టర్లకు సూచించారు.
ఆయా వలంటీర్ల వాట్సాప్ గ్రూపుల తొలగించిన వివరాలను అధికారులు తెలియజేయాలని కూడా ఆ ఆదేశాల్లో పేర్కొన్నారు. అంతేగాక ప్రజలను కూడా వాట్సాప్ గ్రూపుల నుంచి ఎగ్జిట్ అయ్యేలాగ అప్రమత్తం చేయాలన్నారు. ఉన్నతాధికారుల నుంచి అందిన ఆదేశాలతో జిల్లాలోనూ గ్రామ వార్డు సచివాలయాల శాఖ ఇన్ చార్జిలు హడావుడిగా ఆ సమాచారాన్ని మండల, మున్సిపల్ స్థాయి అధికారులకు పంపారు. కాగా,ఈ ఏడాది మార్చి 16న ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిన అనంతరం కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) ఆదేశాల మేరకు రాష్ట్రంలోని వలంటీర్ల అందరికీ అప్పట్లో ప్రభుత్వం అందజేసిన మొబైల్ ఫోన్లు, సిమ్ కార్డులను గ్రామ వార్డు సచివాలయాల శాఖ స్వాధీనం చేసుకుంది. ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత కూడా ఇప్పటి వరకు వలంటీర్లు ఎవ్వరికీ ఆ ఫోన్లను, సిమ్ కార్డులను తిరిగి అందించలేదు.

మరికొన్ని వార్తా విశేషాలు…

కూటమిలో ‘నామినేటెడ్’ ఈక్వేషన్స్

RELATED ARTICLES

Most Popular

Recent Comments