Homebreaking updates newsఅయోధ్య రాముడి ఆలయ విశేషాలివిగో..

అయోధ్య రాముడి ఆలయ విశేషాలివిగో..

భారత్ సమాచార్, జాతీయం : అయోధ్యలో రామయ్య ప్రాణప్రతిష్ఠ జనవరి 22న జరుగనుంది. ఈ వేడుకలను కనీవినీ ఎరగని రీతిలో నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈవేడుకను విజయవంతం చేయడం ద్వారా రాబోయే ఎన్నికల్లో ఓటర్ల దృష్టిని ఆకర్షించేలా వివిధ కార్యక్రమాలను చేపట్టబోతున్నారు. రామాలయ ప్రాణప్రతిష్ఠ సందర్భంగా అయోధ్య, రామాలయంపై విశేషాలను చూద్దాం..

  •  అయోధ్య భవ్య రామమందిరం కోసం 400 కేజీల బరువైన తాళపు బుర్రను అలీగడ్ కు చెందిన సత్యప్రకాశ్ శర్మ తయారుచేసి రామాలయ అధికారులకు అందించనున్నారు.
  • రామాలయాన్ని ఎలాంటి తుఫాన్ లు, భూకంపాలు వచ్చినా తట్టుకునే విధంగా డిజైన్ చేశారు. 2500ఏండ్లపాటు నిలిచి ఉండే టెక్నాలజీని వాడారు. ఈ ఆలయాన్ని నాగర శైలిలో నిర్మించారు. గర్భగుడిని అష్టభుజి ఆకారంలోనూ, ఆలయ శిఖరం కూడా అష్టభుజి ఆకారంలోనే ఉంటుందట.
  • రాముడి విగ్రహాన్ని నేపాల్ కాళిగండకి నదీ తీరంలో సేకరించిన శాలిగ్రామ రాళ్లతో తయారు చేశారు.
  •  ఆలయంలో భక్తులు ఓ అద్భుతాన్ని చూడబోతున్నారు. ప్రతీ రోజూ 5-10 నిమిషాల పాటు సూర్య కిరణాలు రాముడి నుదుటిపై బొట్టులా పడేలా డిజైన్ చేశారు. ఈ దృశ్యం మధ్యాహ్నం 12గంటలకు చూడవచ్చు.
  •  ప్రాణప్రతిష్ట సమయం 22వ తేదీ మధ్యాహ్నం 12.30 గంటలకు నిర్ణయించారు. ఆ అద్భుతమైన ముహుర్తం 54 సెకన్లు ఉంటుందట.
  •  రామాలయానికి 42 భారీ గంటలు(బెల్స్) కర్నాటక నుంచి తరలిస్తున్నారు.
  • అలాగే భారీ అగరుబత్తిని గుజరాత్ లో తయారు చేయించారు. ఇది 45 రోజుల పాటు వెలుగనుంది. 5000 పూలదండల నుంచి ఈ అగరుబత్తిని తయారు చేశారు.
  • 600 కేజీల నెయ్యిని రాజస్థాన్ రాష్ట్రం నుంచి తరలిస్తున్నారు. 5000లకు పైగా స్థంభాలను కూడా ఇక్కడి నుంచే తరలించారు.

మరికొన్ని కథనాలు…

ప్రమాదకర స్థాయికి భారత్‌ అప్పులు..

RELATED ARTICLES

Most Popular

Recent Comments