Homebreaking updates newsబెడ్రూం, బాత్రూం వీడియోలు తీసి..శాడిస్టు భర్త అరాచకం

బెడ్రూం, బాత్రూం వీడియోలు తీసి..శాడిస్టు భర్త అరాచకం

భారత్ సమాచార్, క్రైమ్ : భార్యాభర్తల మధ్య ప్రేమలే తప్ప పగలు ఉండకూడదని, ఆత్మీయతే కానీ అహంకారాలకు పోకూడదని, మోహమే తప్ప మోసాలు ఉండకూడదని పెద్దలు హితబోధ కూడా చేస్తారు. కానీ ఈ జంట విషయంలో అది జరుగలేదు. ఓ శాడిస్టు భర్త చేసిన పనికి మగ జాతి తలదించుకోవాల్సి వస్తోంది. ఇంతకీ ఆ స్టోరీ ఏంటో మీరే చదవండి..

కుటుంబ సభ్యులు కుదిర్చిన సంబంధంతో ఆ జంట కొంతకాలం సంతోషంగానే గడిపింది. అయితే ఆ భర్త తన భార్యకు తెలియకుండా బెడ్ రూంలో గడిపిన క్షణాలను, బాత్రూంలో స్నానం చేసిన దృశ్యాలను వీడియోల్లో రికార్డు చేశాడు. ఆ తర్వాత తన అసలు స్వరూపం బయటపెట్టాడు.

ఈ ఘటన ఇటీవల కర్నాటకలోని బెళగావి సిటీలో జరిగింది. కిరణ్ అనే శాడిస్టు భర్త.. అతడి భార్య పర్సనల్ వీడియోలను చూపిస్తూ బ్లాక్ మెయిల్ చేశాడు. తనకు విడాకులు ఇవ్వకుంటే అసభ్యకరమైన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో, పోర్న్ సైట్లలో పోస్ట్ చేస్తానని బెదిరిస్తున్నాడు. భర్తను చాలా సార్లు ఆమె ఒప్పించే ప్రయత్నం చేసింది. అయినా కిరణ్ భార్య మాటలు వినలేదు. విడాకులు కోరుతూ కోర్టు మెట్లు ఎక్కాడు. ప్రస్తుతం కేసు కోర్టులో విచారణలో ఉంది. భర్త వేధింపులు తట్టుకోలేక అతడి భార్య మానసికంగా కుంగిపోయింది.

కోర్టులో విచారణ జరుగుతున్నా శాంతించని కిరణ్ భార్యను నిత్యం వేధించాడు. తన భర్త వేధింపులతో అతడిపై విరక్తి చెందిన అతడి భార్య బెళగావి జిల్లా సైబర్ స్టేషన్ లో, బెళగావి మహిళా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. తనకు న్యాయం చేయాలని, తన భర్త దగ్గర ఉన్న వీడియోలను డిలీట్ చేయాలని పోలీసులను వేడుకుంది.

బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు పిలిపించి తమ శైలిలో విచారించారు. పోలీసులు కిరణ్ సెల్ ఫోన్ ను పరిశీలించగా అందులో అతడి భార్య అసభ్యకర వీడియోలు, ఫొటోలు ఉన్నట్లు తెలుసుకున్నారు. అతన్ని అరెస్ట్ చేయబోతుండగా పారిపోయి సూసైడ్ అటెంప్ట్ చేశాడు. వెంటనే అతన్ని రక్షించి ఆస్పత్రిలో చికిత్స అందించారు. కోలుకున్న తర్వాత అరెస్ట్ చేసి బెళగావిలోని హిండలగ సెంట్రల్ జైలుకు తరలించారు. ఈ సంఘటన కర్నాటకలో కలకలం రేపింది.

మరికొన్ని క్రైమ్ లైన్స్…

ప్రియుడి మోజులో పడి.. భర్తను కడతేర్చి

RELATED ARTICLES

Most Popular

Recent Comments