HomeUncategorizedనేచురల్ స్టార్ కి ముందు...

నేచురల్ స్టార్ కి ముందు…

భారత్ సమాచార్, సినీ టాక్స్ : మన పక్కింటి కుర్రాడులా భలే నటిస్తున్నాడు అనే మాట నుంచి చూస్తుండగానే నేచురల్ స్టార్ గా ఎదిగిపోయాడు నాని. డబ్బున్న తాతకి మనవడిగా నవ్వించిన, డిస్టర్బ్ చేస్తూ అమ్మాయి వెంటపడ్డా, మతిమరుపు తో కామెడీ చేసిన, రస్టిక్ లుక్ తో ఊర మాస్ రోల్ చేసినా తనకే సాధ్యం అనేలా డిఫరెంట్ జానర్స్ ను టచ్ చేస్తూ సినీ ప్రేమికులను మెప్పిస్తున్నాడు ఈ సినీ ‘జెంటిల్ మెన్’.

కెరీర్ మొదట్లో ఎవరికి సాధ్యం కాని విధంగా వరుసగా 8 సూపర్ హిట్ సినిమాలను అందించాడు. మినిమం గ్యారంటీ హీరోగా మారాడు. ఇలా నేచురల్ స్టార్ అవ్వటానికి ముందు నాని ఒక నటుడు, అసిస్టెంట్ డైరెక్టర్ ఇంకా చాలానే ఉన్నాయి. నేడు ఘంటా నవీన్ బాబు అదేనండీ మన నాని జన్మదినం సందర్భంగా ఈ నేచురల్ స్టార్ కి చెందిన కొన్ని తెర వెనుక సంగతులు…

గంటా రాంబాబు, విజయలక్ష్మి దంపతులకు 1984, ఫిబ్రవరి 24న కృష్ణాజిల్లా చల్లపల్లిలో జన్మించాడు మన హీరో. చిత్ర పరిశ్రమలో మొదటగా శ్రీనువైట్ల, బాపు దగ్గర సహాయ దర్శకుడిగా పనిచేశాడు. అనుకోకుండా చేసిన ఒక వాణిజ్య ప్రకటన ‘అష్టాచమ్మ’లో ఒక హీరోగా చేసే అవకాశం కల్పించింది. తన నేచురల్ నటనకి ఆడియన్స్ ఫిదా అవ్వటంతో వరుస అవకాశాలు క్యూ కట్టాయి. మంచి కథలను ఎంచుకున్నాడు వరుస హిట్ లను కొట్టాడు. నటుడి నుంచి సూపర్ స్టార్ గా ఎదిగాడు. డైరెక్టర్ అవుదామని ఇండస్ట్రీ కి వచ్చినా నటుడిగా, నిర్మాతగా, వ్యాఖ్యాతగా, రేడియో జాకీ గా కూడా చేశాడు. భవిష్యత్ లో తప్పకుండా దర్శకత్వం కూడా చేస్తానని చెప్తాడు నాని.

‘ఎటో వెళ్లిపోయింది మనసు’ చిత్రానికి గాను ఈ ప్రేమికుడి నటనకు నంది అవార్డు వరించింది. ప్రస్తుతం ‘సరిపోదా శనివారం’అనే డిఫరెంట్ సబ్జెక్టుతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ మూవీని‘అంటే సుందరానికి’ దర్శకుడు వివేక్ ఆత్రేయ తెరకెక్కిస్తున్నాడు. ఎస్ జే సూర్య కీలక పాత్రలో కనిపించనున్నాడు, ప్రియాంక మోహన్ కథానాయిక. నాని బర్త్ డే సందర్భంగా నేడు టీజర్ ను
విడుదల చేయనున్నారు.

మరికొన్ని సినీ సంగతులు…

అతడే సంజయ్ లీలా భన్సాలీ…

RELATED ARTICLES

Most Popular

Recent Comments