భారత్ సమాచార్, ఫిలాసఫీ ;
లైఫ్ లో వదిలి వెళ్ళిన
వాళ్ళ గురించి ఆలోచించకు..
జీవితంలో ఉన్న వాళ్ళు
శాశ్వతం అని భావించకు..
ఎవరో వచ్చి నీ బాధను అర్థం చేసుకుంటారని ఊహించకు…
నీకు నీవే ధైర్యం కావాలి…..
నీకు నువ్వే తోడుగా నిలబడాలి…
లోకులు కాకులు,
మనిషిని చూడరు,
మనస్సును చూడరు,
వ్యక్తిత్వాన్ని చూడరు.
కనిపించింది,
వినిపించింది నమ్మేస్తారు,
మాట అనేస్తారు,
ఒక్కోసారి మన కళ్ళే
మనల్ని మోసం చేస్తాయి.
మరొకసారి చెప్పుడు మాటలు
జీవితాలను
తలకిందులు చేస్తాయి
అబద్దాలతో, మోసాలతో
కీర్తి, ప్రతిష్టలను
ఎంత గొప్పగా నిర్మించుకొన్నా..
అవి కుప్పకూలి పోవడానికి
ఒక్క “నిజం”చాలు.
అందుకే కష్టమైనా సరే
నీతిగా బ్రతకడమే మనిషికి
ఉత్తమ మార్గం.
ఒక చిన్న మొక్కనాటి
ప్రతిరోజూ వచ్చి కాయకాసిందా అని
చూడకూడదు.
ఎందుకంటే అది పెరగాలి
మొక్క వృక్షం కావాలి
పుష్పించాలి, పిందెలు రావాలి
అవి కాయలై , పండితే తినగలం.
అలాగే నేను ఇది కావాలి
అనే కోరిక కూడా మొలకై
వృక్షమై ఫలవంతం ఔతుందని తెలిసి
మసలుకోండి
(వాట్సాఫ్ యూనివర్శిటి నుంచి సేకరణ)