భారత్ సమాచార్, సినీ టాక్స్ : నేషనల్ అవార్డ్ విన్నర్ అయిన ప్రముఖ నటి ప్రియమణి ప్రధాన పాత్రలో తెరకెక్కిన లేడీ ఓరియెంటెడ్ మూవీ ‘భామ కలాపం2’. ఈ సినిమా ట్రైలర్ ను తాజాగా నెట్టింట దర్శకనిర్మాతలు విడదుల చేశారు. 2022 లో ఆహా ఓటీటీలో విడుదలైన ‘భామా కలాపం’ చిత్రానికి ఈ సినిమా సీక్వెల్. ఆ ఏడాది ఓటీటీ రిలీజ్ మూవీలలో వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీగా ఈ సినిమా ఓవర్ ది టాప్ (ఓటీటీ) ప్రేక్షకుల మన్ననలు పొందింది. ఆ సంవత్సరం ఆహా లో విడుదలైన చిత్రాలలో ‘భామా కలాపం’ ట్రెండింగ్ లో నిలిచింది. ప్రియమణి, శరణ్య నటన, కథనంలోని సస్పెన్స్ ఈ సినిమా విజయవంతం అవ్వటానికి ప్రధాన కారణాలుగా నిలిచాయి. ఆసక్తికర కథనంతో ఈ మూవీ వీక్షకులను కట్టిపడేసింది.
అంత సక్సస్ అయింది కాబట్టే వెంటనే ఈ మూవీకి సీక్వెల్ ను అనౌన్స్ చేసి వేగంగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. రెండో భాగం ట్రైలర్ కూడా ఆసక్తికరంగా సాగుతోంది. ఒక వంట చేసుకునే సాధారణ గృహిణి ప్రయమణి అనుకోకుండా ఒక పోలీసు వలన భారీ క్రైం లో ఇరుక్కుంటుంది. అందులోంచి ఎలా బయటపడింది అనే కథాంశంతో తెరకెక్కిన చిత్రమే ఇది. ఆహా ఓటీటీ లో ‘భామ కలాపం’కు సీక్వెల్ ఇది. 2022 లో ప్రేక్షకుల్ని సస్పెన్స్ తో కట్టి పడేస్తే, ఇప్పుడు అంతకు మించి అనే స్థాయిలో ట్రైలర్ ఉంది. ఫిబ్రవరి 16 నుంచి ఆహా ఓటీటీ లో స్ట్రీమింగ్ అవ్వనుంది. ఈ ఓటీటీ మూవీపై భారీగానే ఆశలు పెంచుకుంది ప్రియమణి. ఈ మూవీ హిట్ అయితే మరిన్ని లేడీ ఓరియంటెండ్ చిత్రాల్లో ప్రియమణి నటించనుంది. ‘ది ఫ్యామిలీ మేన్’ చిత్రంతో బాలీవుడ్ ప్రేక్షకులకు కూడా కనెక్ట్ అయింది ప్రయమణి. ప్రస్తుతం పాన్ ఇండియా లెవల్లో కథానాయిక ప్రాధాన్యం ఉన్న వెబ్ సిరీస్ లేదా ఓటీటీ మూవీ చేసే ఆలోచనలో ఉంది ప్రియ.