భారత్ సమాచార్, సినీ టాక్స్ ; వెండితెరపై పైసా వసూల్ మూవీలకు కేరాఫ్ అడ్రస్ గా హార్రర్ కామెడీ జోనర్ నిలిచింది. భయపెడుతూ నవ్వించే కాన్సెప్ట్ కి సినీ ప్రేమికులు బ్రహ్మరథం పడుతూ వస్తున్నారు. ప్రముఖ హాస్య నటుడు సప్తగిరి ఈ తరహా చిత్రాలతోనే గుర్తింపు పొందాడు. తాజాగా ఈ జోనర్ లో హీరోగా మరో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నాడు. కమెడియన్ సప్తగిరి కథానాయకుడిగా తెరకెక్కిన ‘భవనమ్’ మూవీ టీజర్ ను దర్శకనిర్మాతలు రిలీజ్ చేశారు. ది హంటెడ్ హౌస్ అనేది ఉపశీర్షిక.
చాలా కాలం తర్వాత ప్రచారచిత్రంలో స్నేహ ఉల్లాల్ ప్రత్యేక గీతంలో కనిపించింది. భయపెడుతూ, నవ్విస్తూ టీజర్ ఆసక్తికరంగా సాగింది. నేపథ్య సంగీతం పర్వాలేదు. ప్రముఖ హాస్య నటులు ధన్ రాజ్, షకలక శంకర్, బిత్తిరి సత్తి ఇందులో నటిస్తున్నారు. సప్తగిరి టైమింగ్ బాగుంది. సూపర్ గుడ్ ఫిలిమ్స్ నిర్మాణంలో ఆర్.బి. చౌదరి నిర్మిస్తున్నారు. బాలాచారి దర్శకుడు. చరణ్ అర్జున్ సంగీతం అందించాడు. ఈ చిత్రాన్ని మే నెలలో ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావటానికి సన్నాహాలు చేస్తున్నారు.