భారత్ సమాచార్, యాదాద్రిభువనగిరి:
అభివృద్ధే ఆయన మార్గం
ఆచరణలో చేసి చూపడమే ఆయన విధానం
నిరంతరం ప్రజాసంక్షేమమే ఆయన ధ్యేయం
వేల కోట్ల నిధులతో అభివృద్ధి, సంక్షేమం
భువనగిరి నియోజకవర్గ అభివృద్ధే ఆయన ఏకైక లక్ష్యం
ఆపదలో అండగా, అన్నదాతలకు భరోసాగా
యువతకు ఉపాధి దిశగా, ప్రజలకు సుజలధాతగా
నిరంతర ప్రజాసేవకుడు
నిత్య చైతన్య కృషివలుడు
నిరుపేదలకు అండగా నిలిచిన నాయకుడు
మన ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి
మహనీయుల ఆశయ సాధనకు కృషి చేస్తూ
అన్ని వర్గాలను సమన్వయ పరుస్తూ
తెలంగాణ అమరవీరుల పోరాట స్ఫూర్తితో
ఉద్యమాల పురుటిగడ్డ
వీప్లవ వీరుల కన్ననేల
భువనగిరి గడ్డపై గులాబీ జెండా ఎగరేసి
ఎన్నో కుటుంబాలకు ఆర్థిక చేయూతనిచ్చి
పేదల పెన్నిధిగా, కష్టల్లో అండగా
అభివృద్ధిని ఆచరణలో చూపించి
ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసిన నాయకుడు
నిరంతర సేవకుడు, సహృదయుడు, సౌమ్యుడు మన పైళ్ల శేఖర్ రెడ్డి
వచ్చే ఎన్నికల్లో భువనగిరి గడ్డపై బీఆర్ఎస్ జెండా ఎగరేసి పైళ్ల శేఖర్ రెడ్డి హ్యాట్రిక్ కొట్టబోతున్నారా, పైళ్ల దెబ్బకు ప్రతిపక్షాలు కంగుతినడం ఖాయమా బీఆర్ఎస్ పార్టీకే మద్ధతుగా ఉంటామని ప్రజలు నిర్ణయించుకున్నారా, ముచ్చటగా మూడోసారి ఎమ్మెల్యేగా పైళ్ల గెలిస్తే మంత్రి పదవి పక్కానా తిరుగులేని శక్తిగా ఎదుగిన పైళ్ల శేఖర్ రెడ్డిని భువనగిరిలో ఢీకొట్టిదేవరు, భువనగిరి అభివృద్ధే శ్వాసగా, ప్రజాసంక్షేమమే ధ్యేయంగా ముందుకెళ్తున్న పైళ్ల శేఖర్ రెడ్డికి అడ్డులేదని, భువనగిరిలో వార్ వన్ సైడే అని బీఆర్ఎస్ నాయకులు అంచనాలు వేసుకుంటున్నారు. గత పదేళ్లుగా భువనగిరి నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధే తన పనితనానికి నిదర్శనమని ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి ధీమాగా ఉన్నారు.
నాడు టీడీపీ కంచుకోట.. నేడు గులాబీ తోట
ఒకప్పుడు టీడీపీ కంచుకోటగా ఉన్న భువనగిరి నియోజకవర్గం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరిగిన రెండు ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ పార్టీ విజయం సాధించింది. 1985 నుంచి 1999 వరకు టీడీపీ ఎమ్మెల్యేగా ఎలిమినేటి మాధవరెడ్డి ఎమ్మెల్యేగా కొనసాగారు. ఆయన మరణాంతరం జరిగిన 2004, 2009లోనూ ఆయన భార్య ఎలిమినేటి ఉమామాధవరెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఇక తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత జరిగిన 2014 ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తరుఫున ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొందారు, ఆ తర్వాత 2018లో జరిగిన ఎన్నికల్లోనూ పైళ్ల శేఖర్ రెడ్డి ఎమ్మెల్యేగా ఘనవిజయం సాధించారు. ముచ్చటగా మూడోసారి హ్యాట్రిక్ కొట్టి ప్రభంజనం సృష్టించేందుకు ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి సిద్ధంగా ఉన్నారు.
ఎమ్మెల్యే దృఢసంకల్పం..ప్రతీపల్లె పచ్చదనం
ప్రజాసంక్షేమం మాటల్లో కాదు చేతల్లో చూపిస్తానని, సౌమ్యుడిగా, సహృదయుడిగా, సేవా తత్పరతతో నిరంతరం ప్రజాసేవ చేస్తూ అభివృద్ధిలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి ముచ్చటగా మూడోసారి ఎమ్మెల్యేగా గెలుపొందుతానని, సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలే తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తాయని ధీమా వ్యక్తం చేస్తున్నారు. నియోజకవర్గంలో ఏ ఆపద వచ్చినా ముందుంటూ పేదల కష్టాల్లో భాగం అవుతూ అదేవిధంగా కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్న బస్వాపూర్ జలాశయంతో భువనగిరి నియోజకవర్గంలోని రైతు కష్టాలు తీరాయని ఎమ్మెల్యే స్పష్టంచేశారు. సీఎం కేసీఆర్ దూరదృష్టి, ప్రత్యేక చొరవతో వ్యవసాయ రంగానికి 24గంటల నాణ్యమైన కరెంట్ సరఫరాతో రైతు కళ్లలో ఆనందం చూస్తున్నామని పైళ్ల శేఖర్ రెడ్డి పేర్కొన్నారు. భువనగిరి నియోజకవకర్గంలో పదేళ్ల కాలంలో ఎన్నో అభివృద్ధి పనులు జరిగాయని, ప్రభుత్వ సంక్షేమ పథకాలతో నియోజకవర్గ ప్రజల రూపురేఖలు మారాయని భువనగిరి నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పైళ్ల శేఖర్ రెడ్డి అన్నారు. పదేళ్ల అభివృద్ధి పనుల్లో భాగంగా ప్రతిపల్లె రూపురేఖలు మార్చాలనే ఉద్దేశ్యంతో పల్లెప్రగతి పథకంలో భాగంగా ప్రతీగ్రామంలో నర్సరీల ఏర్పాటు, ట్రాక్టర్ ట్రాలీల కొనుగోలు, డంపింగ్ యార్డుల నిర్మాణాలు, పల్లెలు పచ్చదనంతో కనువిందు చేసేందుకు పల్లెపకృతి వనాలు, రైతులకు సబ్సిడీ విత్తనాలు, ఎరువులు, రైతులను సమన్వయం చేసేందుకు రైతువేదికలు, ప్రతి గ్రామంలో ప్రతీ ఇల్లు పరిశుభ్రంగా ఉండాలనే ఉద్దేశ్యంతో ఇంటింటికీ తిరిగి చెత్త సేకరణ పనులు, ఓపెన్ డ్రైనేజీ స్థానంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వేసేలా ప్రత్యేక చర్యలు చేపట్టారు.
ప్రజాసంక్షేమం..పైళ్ల శేఖర్‌రెడ్డి ప్రధాన ధ్యేయం
ఫైళ్ల ఫౌండేషన్ ద్వారా నియోజజకవర్గంలోని గ్రామాల్లో సేవా కార్యక్రమాలు నిర్వహించడం, యువతకు ఉచిత డ్రైవింగ్ లైసెన్సుల పంపిణీ, ఎంతో మందికి సీఎం సహాయనిధితోపాటు తన సొంత నిధులు ఇచ్చి ఎన్నో బాధిత కుటుంబాలకు ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి అండగా ఉన్నారు, మరెన్నో నిరుపేద కుటుంబాలను ఆదుకున్నారు. భువనగిరి నియోజకవర్గంలోని మారుమూల గ్రామాల్లో నాణ్యాతా ప్రమాణాలు పాటించి సీసీ రోడ్ల నిర్మాణ పనులు, వాటర్ ప్లాంట్లను నిర్మించి సుజల ధాతగా పేరు తెచ్చుకున్నారు. గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించాలని క్రీడా ప్రాంగణాలు, వ్యాయామం కోసం ఒపెన్ జిమ్‌ల ఏర్పాటు, పల్లెప్రకృతి వనం, వైకుంఠధామాల నిర్మాణం, సాగునీరు, తాగునీటి సదుపాయాలను కల్పించి భువనగిరి నియోజకవర్గంలో ప్రజల అవసరాలు తీర్చారు. హరితహారం పథకంలో భాగంగా నియోజకవర్గంలో చెట్ల పెంపకం, మండల కేంద్రాల్లో ఇతర పార్కుల సుందరీకరణ పనులు చేపట్టి నిరంతరం అభివృద్ధే ధ్యేయంగా ముందుకెళ్తున్న పైళ్ల శేఖర్ రెడ్డిని వచ్చే ఎన్నికల్లో భారీ మెజారిటీతో ఎమ్మెల్యేగా గెలిపించేందుకు నియోజకవర్గ ప్రజలు సిద్ధమైనట్లు సమాచారం.
ప్రజాసేవకుడు, నిత్యకృషివలుడు..మన పైళ్ల శేఖరన్న
ఫామాయిల్ తోటల పెంపకానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేసిందని, ఫామాయిల్ చెట్లకు 80% సబ్సిడీ ప్రభుత్వమే ఇస్తుందని అంతేకాకుండా 4 సంవత్సరాల వరకు మొక్కల సంరక్షణ కూడా పూర్తిగా ప్రభుత్వమే చూసుకుంటుందని భువనగిరి నియోజకవర్గ రైతులకు పైళ్ల శేఖర్ రెడ్డి భరోసా కల్పించారు. గూడు నీడ లేని నిరుపేదలకు అండగా ఉండాలన్న ఉద్దేశ్యంతో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, పేద దళితులకు దళితబంధు ఆర్థిక సాయం, మిషన్ భగీరథ పథకం ద్వారా నియోజకవర్గంలోని ఇంటింటికీ స్వచ్ఛమైన మంచినీరు అందించారు. రైతు పెట్టుబడి పెట్టేందుకు పెట్టుబడి సాయం కింద రైతుబంధు, మరణించిన రైతు కుటుంబం రోడ్డుమీదికి రావొద్దని రైతుబీమా పథకం, అనారోగ్యానికి గురైన నిరుపేద కుటుంబానికి ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కించేందుకు సీఎం సహాయనిధి చెక్కుల అందజేసి ఎన్నో బాధిత కుటుంబాలను ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి ఆదుకున్నాడు. భువనగిరి పట్టణంలోని పెద్ద చెరువుకు రూ.9.70 కోట్ల HMDA నిధుల ద్వారా సుందరీకరణ పనులను ఎమ్మెల్యే ప్రారంభించారు.