Chennai: చెన్నైలో బాంబు బెదిరింపులు కలకలం.. సీఎం సహా నటుడుకి బెదిరింపులు

భారత్ సమాచార్.నెట్: తమిళనాడు రాజధాని చెన్నైలో బాంబు బెదిరింపులు కలకలం రేపాయి. సీఎం ఎంకే స్టాలిన్ నివాసంతో పాటు ప్రముఖ నటుడు, తమిళగ వెట్రి కజగం అధినేత విజయ్ నివాసానికి బాంబు బెదిరింపులు వచ్చాయి. బాంబు బెదిరింపులతో అప్రమత్తమైన అధికారులు విస్తృత తనిఖీలు చేశారు. తనిఖీల్లో అనుమానాస్పదంగా ఏమీ కనిపించక పోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

 

అయితే విఘ్నేష్ అనే వ్యక్తి చెన్నై పోలీస్ కంట్రోల్ రూమ్‌కు ఫోస్ చేసి ఈ బెదిరింపులకు పాల్పడినట్లు సమాచారం. ఈ సాయంత్రం సీఎం స్టాలిన్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ కావడానికి ముందే స్టాలిన్ నివాసం పేల్చేస్తామని వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో అప్రమత్తమైన పోలీస్ కంట్రోల్ రూమ్.. బాంబ్ స్క్వాడ్‌, డాగ్ స్క్వాడ్‌‌లతో సీఎం నివాసానికి చేరుకుని.. అనువనువు తనిఖీ చేశారు. కానీ ఎలాంటి పేలుడు పదార్థాలు అక్కడ లభించలేదు.

 

ఫేక్ కాల్‌గా నిర్ధారించినప్పటికే సీఎం నివాస పరిసరాల్లో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. టీవీకే అధినేత విజయ్ ఇంటికి కూడా ఇలాంటి బెదిరింపు కాల్‌ రావడంతో అక్కడా పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. కానీ అక్కడ కూడా ఎలాంటి పేలుడు పదార్థాలు లభించలేదు. ప్రస్తుతం ఈ బాంబు బెదిరింపులు చేసిన వ్యక్తిని పట్టుకునే పనిలో ఉన్నారు పోలీసులు. కాగా, దేశంలో ఇలా ఫేక్ కాల్స్‌తో బాంబు బెదిరింపులకు పాల్పడుతున్న సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతోంది.

Share This Post