భారత్ సమాచార్, సినిమా : బ్రహ్మనందం సభల్లోనూ, ఇంటర్వ్యూల్లోనే తనకు వెండితెరపై అవకాశాలు ఇచ్చి నటుడిగా జీవితాన్ని ప్రసాదించింది జంధ్యాల అని చాలా సార్లు చెప్పారు. ఆయన లేకుంటే తాను హాస్యనటుడిగా ఉండేవాడినే కాను అని కూడా అన్నారు. కానీ అలాంటి జంధ్యాలనే బ్రహ్మనందం అవమానించారా? ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. కోట్లు సంపాదించిన బ్రహ్మనందం.. తనకు లైఫ్ ఇచ్చిన జంధ్యాలను విస్మరించడం ఏంటని నెటిజన్లు విస్మయం చెందుతున్నారు.
గుర్తించి అవకాశాలు కల్పించారు…
తెలుగు సీమలో జంధ్యాల ఉల్లాసకర హాస్యచిత్రాలకు కేరాఫ్ అడ్రస్. ఆయన రైటర్ నుంచి డైరెక్టర్ గా మారి ఎన్నో హిట్ చిత్రాలు అందించారు. రాజేంద్రప్రసాద్, నరేశ్, బ్రహ్మనందం, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, సుత్తివేలు, సుత్తి వీరభద్రరావు, కోట శ్రీనివాసరావు, శ్రీలక్ష్మి, దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ తదితర వందలాది మందికి అవకాశాలు ఇచ్చి వారిని లబ్ధప్రతిష్ఠులను చేశారు.
ప్రియ శిష్యుడు అనే నమ్మకంతో వెళితే…
అలాంటి జంధ్యాల ఓ సమయంలో ఆర్థికంగా చాలా కష్టాలు పడ్డారు. ఎన్నోఇండ్రస్టీ హిట్ లను చూసిన ఆయన.. వరుస ప్లాపులను ఎదుర్కొన్నారు. తీవ్ర నష్టాలు వచ్చాయి. దీంతో డబ్బులు సాయం చేయాలని తన శిష్యుడు బ్రహ్మనందం దగ్గరకు వెళ్లాడు. వాస్తవానికి బ్రహ్మనందంకు అరగుండు పాత్రను పెట్టి ‘అహనా పెళ్లంట’ చిత్రంతో జంధ్యాలే తెరంగ్రేటం చేయించారు. తర్వాత ఎన్నో సినిమాల్లో బ్రహ్మనందానికి మంచి వేషాలు ఇచ్చి ఆయన ఉన్నతికి తోడ్పడ్డారు. అందుకే జంధ్యాల బ్రహ్మనందం దగ్గరకు వెళ్లి డబ్బు సాయం అడిగాడు. అయితే బ్రహ్మనందం దగ్గర డబ్బులు ఉన్నా లేవని చెప్పి పంపించారట.
ఈవీవీ ముందుకొచ్చాడు…
ఈ సంఘటన అప్పట్లో పెద్ద సంచలనమే అయ్యింది. ఎంతో మంది నొచ్చుకున్నారట కూడా. పాపం జంధ్యాల చేయిచాచి డబ్బులు అడిగినప్పుడు ఇవ్వకపోవడం ఏంటని బ్రహ్మనందాన్ని అందరూ తిట్టుకున్నారట. జంధ్యాలకు డబ్బు అవసరమైందని తెలుసుకున్నా డైరెక్టర్ ఈవీవీ సత్యనారాయణ ఆయనకు సాయం చేయాలని అనుకున్నారు. ఈవీవీ కూడా జంధ్యాల శిష్యుడే. ఆయన దగ్గరే దర్శకత్వ మెళకువలు నేర్చుకున్నారు. జంధ్యాలకు నేరుగా డబ్బులిస్తే తీసుకోడని భావించి.. ఇంటికి సతీసమేతంగా ఆహ్వానించాడు.
గురుదక్షిణగా తీసుకోమన్నారు…
ఇంటికొచ్చిన జంధ్యాల దంపతులకు ఈవీవీ మంచి విందు భోజనం ఏర్పాటు చేశారు. అనంతరం దంపతులను సన్మానించి డబ్బును అందజేశారు. వద్దని జంధ్యాల అన్న కూడా గురుదక్షిణగా ఇస్తున్నానని కాదనవద్దని ఈవీవీ బతిమాలాడు. ఇక జంధ్యాలకు తీసుకోక తప్పలేదు. ఈ విషయంలో బ్రహ్మానందాన్ని చాలా మంది తిట్టుకున్నారని టాలీవుడ్ టాక్.