భారత్ సమాచార్, రాజకీయం : తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయఢంకా మోగించినా.. బీఆర్ఎస్ పర్ ఫార్మెన్స్ కూడా బాగానే ఉందని ప్రజల మాట. ఎందుకంటే గులాబీ పార్టీ ఈ ఎన్నికల్లో ఒంటరిగానే 39 సీట్లు గెలిచింది. రాష్ట్ర రాజధాని గ్రేటర్ హైదరాబాద్ లోనైతే ఆ పార్టీ దుమ్మురేపింది. ఇంతలా గ్రేటర్ హైదరాబాద్ లో కారు దూకుడుకు ప్రధాన కారణాల్లో ఐటీ, మున్సిపల్ మంత్రిగా కేటీఆర్ పనితనమే నిదర్శనంగా నిలిచిందని సోషల్ మీడియాలో నెటిజన్లు ట్వీట్ చేస్తూ ట్రెండ్ చేస్తున్నారు. అందుకే మహా నగర ఓటర్లు బీఆర్ఎస్ పార్టీ వైపు ఏకపక్షంగా మొగ్గుచూపారని తెలంగాణ పొలిటికల్ టాక్.
మిగతా తెలంగాణతో పోలిస్తే గ్రేటర్ హైదరాబాద్ డెవలప్ మెంట్ విషయంలో బీఆర్ఎస్ ప్రత్యేక శ్రద్ధ వహించినట్టు ఇక్కడి ప్రజానికానికి అందరికి తెలుసు. ఐటీ, ఇండస్ట్రీ మినిస్టర్ గా కేటీఆర్.. హైదరాబాద్ కు ఎన్నో పరిశ్రమలను తెప్పించటంలా చాలా వరకు సఫలం అయ్యారు. అమెజాన్, గూగుల్, మైక్రోసాఫ్ట్..తదితర వరల్డ్ వైడ్ టాప్ కంపెనీలన్నీ తమ రెండో గమ్యస్థానంగా హైదరాబాద్ ను ఎంచుకోవడంలో కేటీఆర్ చొరవే ఎక్కువ కనిపిస్తోంది. అలాగే ఫార్మా రంగంలోర దేశంలోనే అగ్రగామిగా తెలంగాణ నిలవడానికి కూడా కేటీఆర్ చేసిన కష్టం ఎంతో ఉంది. అలాగే హైదరాబాద్ లో రోడ్లు, స్కైవేలు, ఫ్లై ఓవర్లు.. ఇలా చెప్పుకుంటూ పోతే నగర ఓటర్లు బీఆర్ఎస్ పార్టీ వైపునకు మొగ్గు చూపేందుకు ఎన్నో కారణాలు కనపడుతాయి. కేటీఆర్ లాంటి ఐటీ మినిస్టర్ ను మళ్లీ చూడలేమని గతంలో ఎందరో ప్రముఖులు కామెంట్స్ కూడా చేశారు. అలాగే ఐటీ, ఫార్మా సెక్టార్ ఉద్యోగులకైతే కేటీఆర్ ఒక స్ఫూర్తి అనే చెప్పుకోవాలి. కేటీఆర్ హయాంలో మన భాగ్యనగరం ఐటీలో బెంగళూరు దాటేయడం కూడా వండరే అని చెప్పాలి. గ్రేటర్ హైదరాబాద్ కు దార్శనికుడిగా నిలిచిన కేటీఆర్ సేవలను తెలంగాణ జనం వినియోగించుకోకపోవడం దురదృష్టమేనని నెటిజన్లు ట్వీట్ చేయడం గమనార్హం.