Medak Church భారత్ సమాచార్.నెట్, మెదక్: ఆసియా ఖండంలోనే అతిపెద్ద చర్చిగా గుర్తింపు పొందిన మెదక్ కేథడ్రల్ చర్చి చారిత్రాత్మక వారసత్వ సంపదకు నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తుంది. ఇది దక్షిణ భారతదేశంలో అత్యధికంగా సందర్శించే చర్చిల్లో ఒకటి. ప్రపంచ ప్రఖ్యాతగాంచిన ఈ చర్చిని బ్రిటిష్ వెస్లియన్ మెథడిస్టులకు చెందిన చార్లెస్ వాకర్ పోస్నెట్ నిర్మించారు. 1914 – 1924 మధ్య దాదాపు 10 సంవత్సరాల నిర్మాణం తర్వాత.. డిసెంబర్ 25, 1924న దీన్ని ప్రారంభించారు. బ్రిటిష్ వెస్లియన్ మెథడిస్టులు మెదక్ చర్చిని నిర్మించారు.
గుల్షానాబాద్, మెతుకుసీమ, మెదక్:
1914లో మెతుకుసీమలో కరువు వచ్చిన సమయంలో.. ఈ ప్రాంతానికి సహాయం చేయడానికి.. పనికి ఆహారం కార్యక్రమంలో భాగంగా ఈ చర్చిని నిర్మించారు. మెదక్ చర్చిని గోతిక్ రివైవల్ శైలి కేథడ్రల్, ఎత్తైన స్తంభాలు, తడిసిన గాజు కిటికీలు, రాతి శిల్పాలతో నిర్మించారు. వేలాది మంది కూలీలతో పది సంవత్సరాలపాటు కొనసాగిన నిర్మాణం వల్ల కాలే కడుపులకు పట్టెడు మెతుకులు దొరికేవట. అప్పట్లో ఈ ప్రాంతానికి గుల్షానాబాద్ అని పేరు. వేలాది జనం చర్చి నిర్మాణంలో భాగస్వాములు కావడం కోసం తండోపతండాలుగా తరలివెళ్లేవారట. వారిని చూసి ఎక్కడికి వెళ్తున్నారని అడిగితే ‘మెతుకు’ కోసం పనికి వెళ్తుమాని చెప్పేవారట. దీంతో ఈ ప్రాంతం గుల్షానాబాద్ నుంచి మెతుకు సీమగా పేరుగాంచింది. అది కాస్తా రానురాను మెదక్ గా రూపాంతరం చెందింది.
ప్రపంచంలో రెండవ అతిపెద్ద డియోసెస్ ఈ చర్చి సొంతం:
ఈ చర్చి నిర్మాణం కోసం ఆరో నిజాం 1000 ఎకరాల భూమిని కేటాయించారు. సుమారు రూ.14లక్షల ఖర్చు చేశారు. కొంతకాలం తర్వాత ఈ చర్చికి రూ.2కోట్లతో మరమ్మతులు చేశారు. క్రిస్మస్, గుడ్ ఫ్రైడే లాంటి పర్వదినాల్లో ఈ చర్చిని సందర్శించేందుకు విదేశీయులు కూడా ఇక్కడికి వస్తుంటారు. సందర్శకుల్లో క్రైస్తవులే కాకుండా ఇతర మతస్తులు కూడా వస్తుంటారు. ఇది 100 అడుగుల వెడల్పు, 200 అడుగుల పొడవు ఉంటుంది. దాదాపు 5,000 మందికి వసతి కల్పించే సామర్ధ్యం ఉండడం విశేషం. చర్చి పైకప్పు బోలు స్పాంజ్ మెటీరియల్‌తో సౌండ్‌ప్రూఫ్‌తో నిర్మించారు. బెల్ టవర్ 175 అడుగుల ఎత్తులో ఉంటుంది ఈ చర్చి మెదక్ జిల్లాలో ఉంది. దక్షిణ భారతదేశంలో అత్యధికంగా సందర్శించే చర్చిల్లో ఇది ఒకటి. మరో విశేషం ఏంటంటే.. మెదక్ చర్చి దక్షిణ భారతలో బిషప్ స్థానం దక్కించుకుంది. మెదక్ డయోసెస్ ఆసియాలో అతిపెద్దది. ప్రపంచంలో రెండవ అతిపెద్ద డియోసెస్ ఇక్కడే ఉంది. మెదక్ చర్చిలో క్రిస్‌మస్ వేడుకలు ఘనంగా జరుగుతాయి. విదేశాలు, దేశంలోని ఇతర రాష్ట్రాల నుంచి ఇక్కడికి వస్తారు.
మరిన్ని కథనాలు: