Homebreaking updates newsఓలా, ఉబర్, ర్యాపిడోకు కేంద్రం చెక్  

ఓలా, ఉబర్, ర్యాపిడోకు కేంద్రం చెక్  

భారత్ సమాచార్.నెట్, న్యూ ఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం (Central Govt) మరో కీలక నిర్ణయం తీసుకుంది. నగరాల్లో, పట్టణాల్లో నడిచే ఓలా (OLA), ఉబర్(Uber), ర్యాపిడో (Rapido) ట్యాక్సీలకు ప్రత్యామ్నాయంగా కొత్త యాప్‌ను తీసుకువచ్చేందుకు రంగం సిద్ధం చేస్తోంది. ఓలా, ఉబర్, ర్యాపిడో సంస్థల దోపిడీని అరికట్టేందుకు సహకార్ ట్యాక్సీ పేరుతో కొత్త యాప్‌ను తీసుకురాన్నున్నట్ల కేంద్రం వెల్లడించింది. ఓలా, ఉబర్, ర్యాపిడో యాప్‌లకు పోటీగా తీసుకురానున్న ఈ కొత్త యాప్ గురించి కేంద్రమంత్రి అమిత్ షా పార్లమెంటు వేదికగా ప్రకటించారు.

ప్రస్తుతం నగరాలు, పట్టణాల్లో ఎక్కడికి వెళ్లాలన్నా.. జనం ఓలా, ఉబర్, ర్యాపిడో వంటి సేవలను ఉపయోగించుకుంటున్నారు. అయితే ఈ ఓలా, ఉబర్‌ కంపెనీల దోపిడీకి అటు కస్టమర్లు.. ఇటు డ్రైవర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆయా సంస్థలు భారీగా లాభాలు తీసుకుని.. డ్రైవర్లకు తక్కువ చెల్లిస్తూ.. ప్రయాణికుల నుంచి మాత్రం ఎక్కువ డబ్బులు తీసుకుంటున్నాయి. అయితే ఇలాంటి ఆగడాలకు చెక్ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కొత్త యాప్‌ను అందుబాటులోకి తెచ్చేందుకు సిద్ధమైంది.
డైవర్లకు మేలు చేసేందుకు సహకార టాక్సీ ప్లాట్ ఫారమ్ అందుబాటులోకి తీసుకురానుంది కేంద్రం. ప్రజలు తమ టూవీలర్స్, త్రీవీలర్స్, ఆటోలు, కార్లను ఇందులో రిజిస్టర్ చేసుకోవచ్చు. ఈ సహకార టాక్సీ ప్లాట్ ఫారమ్ నుంచి వచ్చే లాభాలు నేరుగా రిజిస్టర్ చేసుకున్న డ్రైవర్లకు వెళతాయని కేంద్రం తెలిపింది. కాగా వినియోగదారుడు ఐఫోన్ లేదా ఆండ్రాయిడ్ ఫోన్‌ల బుక్ చేసుకుంటున్నారా అనే దాని ఆధారంగా కూడా రైడ్ ఛార్జీలు మారుతున్నాయని నివేదికలు వెలువడిన తర్వాత సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ ఇటీవల రెండు కంపెనీలకు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే.

 

RELATED ARTICLES

Most Popular

Recent Comments