Homebreaking updates newsసదరం స్లాట్ బుకింగ్ లో మార్పులు

సదరం స్లాట్ బుకింగ్ లో మార్పులు

భారత్ సమాచార్, అమరావతి ;

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ద్యివ్యాంగులకు అందించే సదరం సర్టిఫికెట్ (అంగవైకల్య ధృవీకరణ పత్రం) బుకింగ్ (సదరం స్లాట్) లో కొన్ని మార్పులను చేపట్టింది. ప్రస్తుతం సచివాలయాల పరిధిలో సదరం స్లాట్ బుకింగ్ కొనసాగుతుంది. దివ్యాంగుల సౌలభ్యం కోసం సదరం స్లాట్ బుకింగ్ లో పలు మార్పులు చేర్పులు చేయడం జరిగింది. దివ్యాంగులు తమ దగ్గరలో ఉన్నటువంటి ఏదైనా మీ సేవ కేంద్రం నుంచి స్లాట్ బుక్ చేసుకోవచ్చు. స్లాట్ అందుబాటులో ఉంటే లబ్దిదారులకి సంబంధిత సదరం క్యాంప్ వివరాలుతో కూడిన రసీదు ఇవ్వడం జరుగుతుంది. ఒక వేళ స్లాట్ గాని అందుబాటులో లేకపోతే ముందుగా వారి స్లాట్ అయితే బుక్ అవుతుంది తర్వాత క్రమ సంఖ్య అనుగుణంగా వారికి రసీదు ఇవ్వడం జరుగుతుంది. అయితే వీరికి సదరం క్యాంప్ నిర్వహణ ఆన్లైన్లో అప్డేట్ చేయగానే సంబంధిత లబ్ధిదారుని మొబైల్ కి ఎస్ఎంఎస్ ద్వారా క్యాంప్ ఏ రోజు, ఎక్కడ అనేది సమాచారం పంపించడం జరుగుతుంది. ఎవరికైతే క్యాంప్ వివరాలు ఎస్ఎంఎస్ అందుతుందో అటువంటి వారు మాత్రమే క్యాంపు కి హాజరు కావాల్సి ఉంటుంది. ఈ అవకాశాన్ని దివ్యాంగులు సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచించారు.

మరికొన్ని వార్తా విశేషాలు…

ఉచిత ఇసుకను ఎలా బుక్ చేసుకోవాలంటే…

 

RELATED ARTICLES

Most Popular

Recent Comments