భారత్ సమాచార్, ఆరోగ్యం ;
చెర్రీలంటే ఇష్టపడనివారు ఉండరంటే అతిశయోక్తి కాదు. ఇప్పడు భారత్ తో కూడా ఇవి విరివిగా లభ్యం అవుతున్నాయి. నేరేడు జాతికి చెందిన ఈ పళ్లలో మంచి పోషకాలున్నాయి. ఇవి ఆరోగ్యాన్ని కాపాడతాయి. ఇందులో ఉన్న యాంటీ ఇన్‌ఫ్లేమెటరీ కెమికల్ గుండె సంబంధిత వ్యాధులను నివారిస్తాయి. నిద్రలేమితో బాధపడేవారికి ఇవి మంచి ఓౌషదంలా పని చేస్తుంది. చాలా దూరం పరుగెత్తే రన్నర్స్ కండరాల నొప్పినుంచి తప్పించుకునేందుకు ట్రైనింగ్‌కు ముందు పెయిన్ కిల్లర్స్‌ను వాడుతున్నారు. అయితే వీటిని దీర్ఘకాలికంగా వాడటం ఆరోగ్యానికి మంచిది కాదు. పెయిన్‌కిల్లర్స్‌కు బదులు చెర్రీస్‌ను తీసుకోవడం మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. వీటివల్ల వ్యాయామం సమయంలో వచ్చే నొప్పి చాలా వరకు తగ్గుతుంది. చెర్రీ పండ్లలో యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయి. ఇవి మంచి రంగును ఇస్తాయి. చెర్రీ పండ్లు తినడం వల్ల ఆర్థ్రైటిస్ సమస్య దూరమవుతుంది. ఓస్టియో ఆర్థ్రైటిస్‌తో బాధపడుతున్న మహిళలు చెర్రీ జ్యూస్‌ను రోజూ రెండు సార్లు మూడు వారాలపాటు తాగితే మంచి ఉపశమనం లభిస్తుంది. కొవ్వు తక్కువగా ఉండే ఈ పండ్లు తినడం వల్ల లావు కూడా తగ్గొచ్చు. నిద్రలేమి చాలా మందిని బాధపెడుతున్న సమస్య. దీని కారణంగా చాలా మంది క్రానిక్ పెయిన్, హైబిపి, టైప్2 డయాబెటిస్ బారిన పడుతున్నారు. మెలటోనిన్ హార్మోన్ ఎక్కువగా ఉండే ఈ చెర్రీలు తినడం వల్ల గాఢ నిద్ర బాగా పడుతుంది. పండ్లు డైరెక్ట్‌గా తినడంకంటే జ్యూస్ చేసుకుని తాగడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయంటున్నారు నిపుణులు.