భారత్ సమాచార్.నెట్, న్యూ ఢిల్లీ: మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ (Chhatrapati Shivaji) తనయుడు శంభాజీ మహారాజ్ (Sambhaji Maharaj) జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన చిత్రం “ఛావా”. లక్ష్మణ్ ఉటేకర్ (Laxman Utekar) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీలో విక్కీ కౌశల్ (Vicky Kaushal), రష్మిక మందన్నా (Rashmika Mandanna) ప్రధాన పాత్రలు పోషించారు. ఇక ఏఆర్ రెహమాన్ (A.R. Rahman) అందించిన సంగీతం ఈ పీరియాడికల్ మూవీ.. ఫిబ్రవరి 14న విడుదలైన ఈ చిత్రం.. మొదటి షో నుంచి హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఉత్తరాదిలో మంచి రెస్పాన్స్ రావడంతో మేకర్స్ తెలుగులో కూడా విడుదల చేశారు. మార్చి 7న తెలుగులో రిలీజ్ అయిన ఈ చిత్రం.. ఇక్కడ కూడా మంచి వసూళ్లను రాబడుతోంది.
ఛావా స్పెషల్ స్క్రీనింగ్..
తాజాగా ఈ సినిమా మరో హిస్టారికల్ మూమెంట్‌ని అందుకున్నట్టుగా తెలుస్తుంది. ఈ సినిమా తాలూకా స్పెషల్ స్క్రీనింగ్‌ని పార్లమెంట్ (Chhaava Special Screening In Parliament)లో వేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మార్చి 27న గురువారం సాయంత్రం 6 గంటలకి ఛావా ప్రత్యేక స్క్రీన్‌లో వేయనున్నారు. ఈ మూవీని దేశ వ్యాప్తంగా ఉన్న ఎంపీలతో ప్రధాని మోదీ (PM Modi) వీక్షించనున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ ప్రైడ్ మూమెంట్‌పై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. దీనిపై పూర్తి క్లారిటీ రావాల్సి ఉంది. కాగా గతంలో ది కశ్మీర్ ఫైల్స్, సబర్మతీ రిపోర్ట్ వంటి సినిమాలు కూడా పార్లమెంట్‌లో స్పెషల్ షోలు వేశారు. ప్రధాని మోదీతో సహా కేంద్ర మంత్రులందరూ ఈ సినిమాలను ప్రత్యేకంగా వీక్షించారు. ఇప్పుడు ఛావా కూడా ఈ జాబితాలో చేరనుంది.
ప్రధాని మోదీ ప్రశంసలు..
ఇకపోతే ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన 98వ అఖిల భారత మరాఠీ సాహిత్య సమ్మేళనం ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోదీ ‘ఛావా’ చిత్రంపై ప్రశంసలు కురిపించిన సంగతి తెలిసిందే. హిందీ సినిమాతో పాటు మరాఠీ చిత్రాల స్థాయిని పెంచడంలో మహారాష్ట్ర, ముంబై కీలకపాత్ర పోషించిందని అభినందించారు. కొత్త సినిమా ‘ఛావా’ ప్రస్తుతం అంతటా ఆదరణ సొంతం చేసుకుంటుందని.. శివాజీ సావంత్ మరాఠీ నవల వల్లే ఈ శంభాజీ మహరాజ్ వీరత్వాన్ని చిత్ర రూపంలో పరిచయం చేయడం సాధ్యమైందని ప్రధాని మోదీ అభిప్రాయపడ్డారు.