భారత్ సమాచార్.నెట్, హైదరాబాద్: హైదరాబాద్ నగర శివారులో ఉన్న చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు (Chief priests of Chilkur Balaji Temple) రంగరాజన్ (Rangarajan)పై ఇటీవల దాడి జరిగిన సంగతి తెలిసిందే. రంగరాజన్‌పై జరిగిన దాడి రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై హిందూ సంఘాలు, రాజకీయ నేతలు, ప్రముఖులు తీవ్రంగా ఖండించారు. తాజాగా ఈ వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న వీర రాఘవరెడ్డి (Veera Raghava Reddy)కి కోర్టు బెయిల్ మంజూరు చేసింది.
నిందితుడు వీర రాఘవరెడ్డికి రాజేంద్ర నగర్ కోర్టు షరతులతో కూడిన బెయిల్ (Bail) మంజూరు చేసింది. రూ.15 వేలతో రెండు పూచీకత్తులు సమర్పించాలని కోర్టు ఆదేశించింది. కాగా, ఫిబ్రవరి 7న 20 మందితో సీఎస్ రంగరాజన్ రెడ్డి ఇంటికి వెళ్లిన వీర రాఘవరెడ్డి.. రామదండు కోసం మనుషులను జాయిన్ చేయాలని.. అలానే ఆర్థిక సహాయం చేయాలని డిమాండ్ చేశారు. దీనిని వ్యతిరేకించిన రంగరాజన్ ఆయన కుమారుడిపై దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన సీసీటీవీలో రికార్డైంది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో రంగరాజన్ కుటుంబం మొయినాబాద్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
ఈ నేపథ్యంలోనే వీర రాఘవ రెడ్డితో పాటు మరికొంతమంది పై కేసులు నమోదు చేసిన పోలీసులు వారిని కూడా అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు. పోలీసులు విచారణలో రాఘవ రెడ్డి నేరం అంగీకరించాడు. ప్రస్తుతం రిమాండ్‌లో ఉన్న నిందితుడు రాజేంద్రనగర్ కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. తాజాగా ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన కోర్టు శనివారం బెయిల్ మంజూరు చేసింది. రూ.15 వేలతో రెండు పూచీకత్తులు సమర్పించాలని రాజేంద్రనగర్ కోర్టు తెలిపింది.