Homebreaking updates newsరాధ కూతురి పెళ్లిలో ‘చిరు’ సందడి

రాధ కూతురి పెళ్లిలో ‘చిరు’ సందడి

భారత్ సమాచార్, సినీ టాక్స్ : టాలీవుడ్ చరిత్రలో.. పాత తరం నుంచి కొత్తతరం వరకు.. బెస్ట్ కాంబినేషన్ ఎవరిదంటే చిరు, రాధ అని ఎవరైనా చెపుతారు. ఈ జంటకు అప్పట్లో ఎంతో క్రేజ్ ఉండేది. 1980 ప్రాంతం నుంచి ఇప్పటి వరకూ చిరంజీవి క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. ఇక అప్పట్లోనైతే ఇండియన్ మైకేల్ జాక్సన్ గా, బిగ్గర్ దన్ బచ్చన్ గా.. ఇండియాలోనే బెస్ట్ డ్యాన్సర్ గా, మాస్ హీరోగా కీర్తినందుకున్నారు. ఆయన పక్కన నటించడం అన్నది హీరోయిన్లకు ఒక కల. ఆయన సరసన నటించే అందరికీ రాకపోయేది. అగ్రహీరోయిన్లకు మాత్రమే ఆ అవకాశం ఉండేది. అలాంటిది ఆయన పక్కన 20 సినిమాలకు పైగా హీరోయిన్ గా నటించి బెస్ట్ పెయిర్ గా పేరు తెచ్చుకున్నది అందాల తార రాధ మాత్రమే.

వీరిద్దరి కాంబినేషన్ లో దొంగ, జేబుదొంగ, అడవి దొంగ, కొండవీటి దొంగ, స్టేట్ రౌడీ, కొదమసింహం, లంకేశ్వరుడు.. వంటి ఎన్నో మరుపురాని చిత్రాలు వచ్చాయి. అన్నీ మ్యూజికల్ హిట్లే. చిరంజీవికి దీటుగా రాధ డ్యాన్స్ చేసేవారు. అందుకే ఈ జంట స్క్రీన్ పై కనిపిస్తే ప్రేక్షకులు, ఫ్యాన్స్ ఉర్రూతలూగేవారు. సినిమాలు వదిలేశాక కూడా రాధతో చిరంజీవి స్నేహం కొనసాగిస్తూనే ఉన్నారు. 80’ఎస్ జనరేషన్ హీరోహీరోయిన్లు గెట్ టుగెదర్ పార్టీలు ప్రతీ సంవత్సరం చేసుకుంటూనే ఉన్నారు.

తాజాగా రాధ కుమార్తె కార్తీక వివాహం తిరువనంతపురంలో జరిగింది. రోహిత్ మేనన్ అనే యువకుడితో ఏడడుగులు నడిచింది. ఈ వేడుకకు చిరంజీవి దంపతులు, రాధిక, సుహాసిని, తెలుగు, తమిళ, మళయాళ చిత్రాల నటీనటులు ఎంతో మంది హాజరయ్యారు. అందరిలోకెల్లా ప్రత్యేకమైన మెగాస్టార్ చిరంజీవి తన పాత సహచరులతో కలిసి సందడి చేశారు. ఈ ఫొటోలు ప్రస్తుతం వైరల్ గా మారాయి.

RELATED ARTICLES

Most Popular

Recent Comments