భారత్ సమాచార్, హైదరాబాద్ ; తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు రావుల శ్రీధర్ రెడ్డి నేడు ప్రెస్ మీట్ ను నిర్వహించారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ఒక్కటై బీఆర్ఎస్ ను బలహీనపర్చాలని కుట్ర చేస్తున్నాయని ఆయన ఆరోపించారు. గత ప్రభుత్వంలో అభివృద్ధి జరగకపోతే మా ఎంపీలను బీజేపీలోకి ఎలా చేర్చుకున్నారని ప్రశ్నించారు. కేసీఆర్ ప్రభుత్వ పనితీరు బాగుందని గతంలో మోడీ అన్నారని తెలిపారు. బీఆర్ఎస్ దొంగల పార్టీ అయితే మా నేతల ఇంటి ముందు కిషన్ రెడ్డి నైట్ వాచ్మెన్ ఉద్యోగం ఎందుకు చేస్తున్నారు అని విమర్శించారు. గులాబీ పార్టీ నుండి వచ్చిన వారికే బీజేపీ ఎంపీ టిక్కెట్లు కేటాయించింది. దొంగలు అయితే వారికి ఎంపీ టిక్కెట్లు బీజేపీ ఎట్లా ఇస్తుందన్నారు. కిషన్ రెడ్డి పార్లమెంట్ నియోజకవర్గంలో ఒక్క బీజేపీ ఎమ్మెల్యే గెలవడు, నియోజకవర్గానికి కు ఏం చేశారని కిషన్ రెడ్డి గెలుస్తాడు? దళితుల భూములు ఆక్రమించుకున్న ఈటెల రాజేందర్ బీఆర్ఎస్ పై విమర్శలు చేయడం తగదని హితవు పలికారు.నాగర్ కర్నూల్ సిట్టింగ్ ఎంపీ రాములు కుమారుడికి టిక్కెట్ ఇస్తే అది కుటుంబ రాజకీయం కాదన్నట్టూ కాషాయా పార్టీ వ్యవహరిస్తుందన్నారు.
ఆరు గ్యారెంటీలు అమలు అయ్యాయా? లేదా అనేది రేవంత్ రెడ్డి చెప్పాలి. రెండు లక్షల రుణమాఫీ ఏమైంది? రైతుబంధు ఇప్పటి వరకు పడలేదు, కేసీఆర్ సీఎంగా వున్నప్పుడు రైతు బంధు ఆగిందా. మహిళలకు రూ.2,500 ఇస్తామని మాట తప్పారు. హామీకు అమలు చేయకుండా ప్రజలను కాంగ్రెస్ పార్టీ ఓట్లు ఎట్లా అడుగుతుందో చూద్దామన్నారు.