భారత్ సమాచార్, అమరావతి ;
ఈ మధ్య మీడియాలో బాగా చక్కర్లు కొట్టిన వార్తా ఏంటంటే… కొందరు దివ్యాంగ విద్యార్థులు తమ సమస్య గురించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కి వాట్సాఫ్ మెసేజ్ ద్వారా తెలియజేశారు. వారి మెసేజ్ కి మంత్రి స్పందించటం ద్వారా 25 మంది దివ్యాంగ విద్యార్థుల సమస్య వెంటనే పరిష్కారం అయింది. ఇది విషయాన్ని మీడియా బాగా హైప్ చేసింది. దీంతో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి చాలా మంది బాధితులు తమ సమస్యలను కూడా పరిష్కరించాలని మంత్రిని వాట్సాఫ్ ద్వారా సంప్రదించటం మొదలుపెట్టారు. ప్రజల నుంచి వరదలా వచ్చిన మెసేజ్ ల కారణంగా సాంకేతిక సమస్య తలెత్తి మంత్రి నారా లోకేష్ వాట్సాఫ్ ను మెటా బ్లాక్ చేసినట్టు ఆయన ప్రకటించారు. ఫిర్యాదు దారులు ఇక పై మెయిల్ ద్వారా వారి సమస్యను ప్రస్తావించాలని మంత్రి ట్వీట్ చేశారు.
‘‘ప్రజల నుంచి వరదలా వచ్చిన మెసేజ్‌లతో సాంకేతిక సమస్య తలెత్తి నా వాట్సప్ మెటా బ్లాక్ చేసింది. మీ సమస్యలు దయచేసి నాకు వాట్సప్ చేయొద్దు. మీ సమస్య ఏదైనా, సహాయం కావాలన్నా ఇకనుంచి నా పర్సనల్ మెయిల్ ఐడీ hello.lokesh@ap.gov.in పంపించండి. పాదయాత్రలో యువతకు నన్ను చేరువ చేసిన “హలో లోకేష్” కార్యక్రమం పేరుతోనే నా మెయిల్ ఐడి hello.lokesh@ap.gov.in క్రియేట్ చేసుకున్నాను. మీ పేరు, ఊరు, మొబైల్ నెంబర్, మెయిల్ ఐడి, సమస్య-సహాయంకు సంబంధించిన పూర్తి వివరాలు వినతులలో పొందుపరిచి మెయిల్ చేయండి. మీకు సహాయం చేయడం, సమస్య పరిష్కరించే బాధ్యత నేను తీసుకుంటాను.’’ అంటూ మంత్రి లోకేష్ తాజాగా ట్వీట్ చేశారు.