భారత్ సమాచార్, తిరుమల ;
కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల ఎడు కొండల శ్రీనివాసుడిని జున్ 26వ తేదీన బుధవారం 77,332 మంది భక్తులు దర్శించుకున్నారని టీటీడీ అధికారులు నేడు వెల్లడించారు.మొత్తం 30,540 మంది సందర్శకులు భక్తితో స్వామి వారికి తలనీలాలు సమర్పించారని అధికారులు తెలిపారు. బుధవారం మాత్రమే స్వామి వారి హుండీకి రూ.4.38 కోట్ల నగదును భక్తులు కానుకలుగా సమర్పించారు. ప్రస్తుతం స్వామి వారి సర్వ దర్శనానికి 21 కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. ఉచిత సర్వదర్శనానికి సుమారు 18 గంటల సమయం పడుతోందని టీటీడీ అధికారుల అంచనా. కంపార్ట్ మెంట్లలో శ్రీ వారి దర్శనం కోసం వేచి ఉండే భక్తులకు ఉచిత అన్న ప్రసాదం, తాగు నీరు పంపిణీ చేపడుతున్నారు. టైమ్ స్లాట్ (SSD) దర్శనానికి 8 కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. రూ.300 రుసుముతో ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 3 గంటల సమయం పడుతోంది. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్టు అధికారులు చెప్పారు.