భారత్ సమాచార్.నెట్: ‘భోళా శంకర్’ (Bhola Shankar) చిత్రం తర్వాత మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) నటిస్తున్న మూవీ విశ్వంభర (Vishwambhara). ‘భోళా శంకర్’ డిజాస్టర్ అవ్వడంతో చిరు.. చాలా కథలు పక్కన పెట్టి.. ‘విశ్వంభర’ కథని ఫైనల్ చేశారు. ‘బింబిసార’ (Bimbisara) తో బ్లాక్ బస్టర్ అందుకున్న మల్లిడి వశిష్ఠ (Mallidi Vassishta) ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు. యూవీ క్రియేషన్స్ (UV Creations) సంస్థ చిరంజీవి కెరీర్లో హైయెస్ట్ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మిస్తోంది. ఈ సినిమాలో చిరుకి జోడీగా త్రిష నటిస్తుండగా.. ఆషిక రంగనాథ్, సురభి, ఇషా చావ్లా వంటి హీరోయిన్లు కీలక పాత్రలు పోషిస్తున్నారు.
ఆల్ రెడీ ఈ సినిమాకి సంబంధించిన టీజర్ విజయదశమి సందర్భంగా విడులైన సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమా నుంచి మేకర్స్ కీలక అప్‌డేట్ ఇచ్చారు. ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్‌ను హనుమాన్ జయంతి సందర్భంగా అంటే ఏప్రిల్ 12న విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. రామా రామా అంటూ సాగే ఈ భక్తి గీతం సినిమా ఆరంభంలోనే ఉంటుందని సమాచారం. ఈ పాట చాలా ప్రత్యేకంగా నిలుస్తుందని మేకర్లు చెబుతున్నారట. రామ రామా అంటూ సాగే ఈ ఫస్ట్ సింగిల్ పోస్టర్ ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటోంది.
మరోవైపు సినిమా విడుదల తేదీని కూడా త్వరలో వెల్లడించనున్నట్లు సమాచారం. సోషియో ఫాంటసీ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాను జూన్‌లో రిలీజ్ చేయాలని మేకర్స్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇంద్ర రిలీజ్ అయిన డేట్‌ను సెంటిమెంట్‌గా పెట్టుకుని విశ్వంభరను విడుదల చేయాలని అనుకుంటున్నారట. ఇది వరకు అయితే మే 9న రిలీజ్ చేస్తారనే టాక్ వచ్చింది. జగదేక వీరుడు అతిలోక సుందరి రిలీజ్ అయిన తేదీనే విశ్వంభర వస్తుందని అంతా అనుకున్నారు. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఆ టైంకు రావడం అసాధ్యమని తెలుస్తోంది.