MYSAA: రష్మిక ‘మైసా’ మూవీ నుంచి క్రేజీ అప్‌డేట్!

భారత్ సమాచార్.నెట్: నేషనల్ క్రష్‌ రష్మిక మందన్న ప్రేక్షకుల్లో ఫుల్ క్రేజ్ ఉన్న సంగతి తెలిసిందే. పుష్పతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన ఈ బ్యూటీ.. ప్రస్తుతం ఫుల్ జ్యోష్‌తో స్టార్ హీరోయిన్‌గా ఇండస్ట్రీలో దూసుకుపోతుంది. ఇటీవల కుబేరాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ అమ్మడు.. ప్రస్తుతం గర్ల్‌ ఫ్రెండ్, హిందీలో థామా వంటి మూవీస్‌లో నటిస్తోంది. ప్రస్తుతం షూటింగ్స్‌ జరుపుకుంటున్న ఈ చిత్రాలు త్వరలో థియేటర్‌ల్లో సందడి చేయనున్నాయి.

 

వరుస సినిమాలతో దూసుకుపోతున్న రష్మిక రీసెంట్‌గా ఓ క్రేజీ ప్రాజెక్టుకు సైన్ చేసిన సంగతి తెలిసిందే. లేడీ ఓరియెంటెడ్ మూవీగా వస్తున్న ‘మైసా’ చిత్రం పాన్ ఇండియా ప్రాజెక్టుగా రూపొందనుంది. ఐదు భాషల్లో విడుదల కానున్న ఈ చిత్రంలో రష్మిక వారియర్‌గా కనిపించనున్నారు. రష్మిక పాత్ర చాలా శక్తివంతంగా ఉండబోతుందని ఇప్పటికే సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

 

తాజాగా ఈ మూవీకి సంబంధించి కీలక అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ‘మైసా’ మూవీకి సంబంధించిన పూజ కార్యక్రమాలు రేపు అంటే ఆదివారం 27వ తేదీన ఉదయం 11 గంటలకు జరగబోతున్నట్లు చిత్ర యూనిట్ అఫీషియల్‌గా అనౌన్స్‌మెంట్ వచ్చింది. ఈ మేరకు తుఫాన్ ఎగిసిపడబోతోంది.. రేపు ఒక శక్తివంతమైన ప్రయాణం ప్రారంభం కాబోతుంది అనే సందేశంతో అధికారిక ప్రకటన చేశారు మేకర్స్. లేడి ఓరియెంటెడ్ మూవీగా వస్తున్న ఈ చిత్రం రష్మిక కెరీర్‌ను ఎలాంటి మలుపు తిప్పుతుందో చూడాలి.

Share This Post