Homemain slidesకరెంట్ బిల్లు కట్టం..సర్కార్ మాఫీ చేస్తుందిగా

కరెంట్ బిల్లు కట్టం..సర్కార్ మాఫీ చేస్తుందిగా

భారత్ సమాచార్, రాజకీయం : తెలంగాణలో వ్యాప్తంగా ఇప్పుడంతా ఆరు గ్యారెంటీలపైనే చర్చ సాగుతోంది. అందులో మహాలక్ష్మి పేరిట ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణం, రూ.10 లక్షల లోపు ఆరోగ్య శ్రీ వర్తింపును డిసెంబర్ 9న సోనియా గాంధీ బర్త్ డే సందర్భంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తోంది. ఇక మిగతా 4 గ్యారెంటీలను అమలు చేసేందుకు సంబంధిత శాఖల ఉన్నతాధికారులతో సీఎం రేవంత్ రెడ్డి, ఇతర మంత్రులు ఉన్నత అధికారులతో సమీక్షలు చేస్తున్నారు.

ఆరు గ్యారెంటీల్లో అతి కీలకమైన హామీ ప్రతీ నిరుపేద ఇంటికి 200 యూనిట్ల వరకూ (అద్దె ఇల్లు అయిన కూడా) ఉచిత విద్యుత్ ను అందించడం. దీని అమలుపై ప్రభుత్వం ఇంకా ఎలాంటి ప్రకటన ఇంకా చేయలేదు. ఈ పథకం అమలు సాధ్యా సాధ్యాలపై తెలంగాణ కేబినెట్ ఉన్నత స్థాయి  విద్యుత్ అధికారుల నుంచి అన్ని వివరాలు తెప్పించుకుంటున్నారు. అదంతా జరిగిన తర్వాత అమలు చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. తాము హామీ ఇచ్చినట్టుగా ఆరు గ్యారెంటీలను 100 రోజుల్లో అమలు చేయాలని ప్రభుత్వ పెద్దలు భావిస్తున్నారు.

అయితే కొందరు జనాలు మాత్రం.. ఇప్పటి నుంచే కరెంట్ బిల్లులు కట్టడం మానేస్తున్నారు. తాము 200 యూనిట్ల లోపే కరెంట్ వాడుకుంటున్నామని, దాన్ని ప్రభుత్వం కొన్ని రోజుల్లో మాఫీ చేస్తుందని, అందుకే కరెంట్ బిల్లులు కట్టడం లేదని బాహాటంగానే చెబుతున్నారు. కానీ ఇప్పటికీ దీనిపై అధికార కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా ఎలాంటి నిర్ణయం ఇంకా తీసుకోలేదని, దానికి సంబంధించిన చర్చలు మాత్రమే నడుస్తున్నాయని అధికారులు చెబుతున్నారు. కరెంట్ బిల్లులు అందరూ కట్టవల్సిందేనని విద్యుత్ శాఖ అధికారులు సూచిస్తున్నారు. ప్రభుత్వం చెప్పిన తేదీ నుంచి మాత్రమే ఉచితంగా కరెంట్ అందిస్తామని, అంతకుముందు బిల్లులు, ఫైన్లు చెల్లించాల్సిందేనని మంత్రులు, విద్యుత్ అధికారులు అంటున్నారు.

మరికొన్ని కథనాలు…

జీరో కరెంటు బిల్లు రావటం లేదా..?

RELATED ARTICLES

Most Popular

Recent Comments