భారత్ సమాచార్, హైదరాబాద్: సైబర్ నేరాలపై పోలీసులు ఎంత అవగాహన కల్పించినా నిత్యం ఎవరో ఒకరు మోసపోతూనే ఉన్నారు. పెట్టుబడులు, అధిక లాభాల పేరుతో సైబర్ కేటుగాళ్లు వేసిన వలకు ఎంతోమంది అమాయకులు చిక్కి బలవుతున్నారు. టెక్నాలజీ పెరిగే కొద్దీ సైబర్ నేరగాళ్లు కొత్త పంథా ఎంచుకుంటున్నారు. వివిధ పద్దతుల్లో మోసాలకు పాల్పడుతున్నారు. తాజాగా ఆన్‌లైన్ ట్రేడింగ్ పేరిట కోట్లు కొల్లగొడుతున్న ముఠాను హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
టెక్నాలజీ పెరిగే కొద్దీ సైబర్ నేరగాళ్లు కొత్త పంథా ఎంచుకుంటున్నారు. వివిధ పద్దతుల్లో మోసాలకు పాల్పడుతున్నారు. తాజాగా ఆన్ లైన్ ట్రేడింగ్ పేరిట కోట్లు కొల్లగొడుతున్న ముఠాను అదుపులోకి తీసుకున్నారు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు.. తక్కువ ఇన్వెస్ట్‌మెంట్ పెడితే ఎక్కువ లాభాలు పొందవచ్చని సైబర్ కేటుగాళ్లు వేసిన వలలో చిక్కి, భారీ మొత్తంలో మోసపోయారు నగరానికి చెందిన కొందరు అమాయకులు. తాము మోసపోయామని గమనించి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితులను కేరళలో అరెస్ట్ చేశారు పోలీసులు
తక్కువ ఇన్వెస్ట్‌మెంట్ పెడితే ఎక్కువ లాభాలు పొందవచ్చని సైబర్ కేటుగాళ్లు వేసిన వలలో చిక్కి, భారీ మొత్తంలో మోసపోయారు. తాజాగా ఇన్వెస్ట్‌మెంట్ పేరిట రూ.9.44లక్షలుపైగా మోసపోయానని హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. తక్కువ ఇన్వెస్ట్‌మెంట్ పెడితే ఎక్కువ లాభాలు పొందవచ్చని సైబర్ నేరగాళ్లు, టెలిగ్రామ్‌లో బాధితుడుకి మెసేజ్ చేశారు. ముందు నిందితులు బాధితుడి ఖాతా లో కొంత లాభాలు వేశారు. ఇది నమ్మిన బాధితుడు సొంత డబ్బులను భారీగా పెట్టుబడి పెట్టాడు. ఆ తర్వాత బాధితుడి అకౌంట్ బ్లాక్ చేశారు నిందితులు. రూ.9.44లక్షలు మోసపోయానని సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇద్దరు నిందితులను కేరళలో అరెస్ట్ చేశారు..
కేరళలో కొన్నిరోజుల పాటు క్యాంప్ వేసి మరీ నిందితులను అరెస్ట్ చేశామని సైబర్ క్రైమ్ డీసీపీ కవిత తెలిపారు. అమాయకులను టెలిగ్రామ్ ద్వారా మెసేజ్‌లు పెట్టి మోసాలు చేస్తున్నట్లు, సైబర్ క్రైమ్ ద్వారా వచ్చే అమౌంట్‌ను రెంట్‌కు తీసుకున్న బ్యాంక్ అకౌంట్స్ ద్వారా ట్రాన్సాక్షన్ చేస్తున్నారన్నారు. ఆయా అకౌంట్స్ నుంచి దుబాయ్‌కి క్రిప్టో కరెన్సీ ద్వారా పంపిస్తున్నారని తెలిపారు. 18అకౌంట్స్ ద్వారా రూ.26కోట్ల ఫ్రాడ్ ట్రాన్సాక్షన్ జరిగినట్లు గుర్తించినట్లు డీసీపీ వివరాలు వెల్లడించారు. చరవాణిలో ఆన్‌లైన్ లింక్‌లు, వెబ్‌సైట్లు, వ్యక్తులను నమ్మకూడదని సైబర్ క్రైమ్ పోలీసులు హెచ్చరిస్తున్నారు.
మరిన్ని కథనాలు: