భారత్ సమాచార్, సినీ టాక్స్ ;
పెళ్లి చూపులు సినిమాతో కమెడియన్ గా పరిచయం అయిన నటుడు ప్రియదర్శి. తెలుగులో టాప్ కమెడియన్ గా గుర్తింపు తెచ్చుకుంటూ… మధ్య మధ్యలో సీరియస్ రోల్స్ తో పాటుగా, కొన్ని లీడ్ రోల్స్ కూడా చేస్తున్నాడు. ప్రస్తుతం ప్రియదర్శి కథనాయకుడిగా తెరకెక్కిన తాజా చిత్రం ‘డార్లింగ్’. ఈ మూవీ ట్రైలన్ ను నేడు విడుదల చేశారు. వై దిస్ కొలవెరి అనే దీని క్యాప్షన్.
ఇందులో ‘ఇస్మార్ట్ శంకర్’ భామ నభా నటేష్ కథానాయిక. ప్రచార చిత్రం ఆసాంతం ఫన్నీగా సాగింది. ప్రియదర్శి, నభా నటేష్ కామెడీ టైమింగ్ బాగుంది. అపరిచితుడులోని మల్టీ పర్సనాలిటీ డిస్ ఆర్డర్ ను కథానాయికకు స్లిప్ట్ పర్సనాలిటీ డిస్ ఆర్డర్ అనే పేరుగా మార్చి కామెడీ సృష్టించే ప్రయత్నం చేశాడు దర్శకుడు. పెళ్లి చేసుకొని భార్యతో ప్యారిస్ కి హనిమూన్ వెళ్లాలనుకునే యువకుడి జీవితంలోకి ఆనంది వచ్చిన తర్వాత అతడి జీవితం ఏం మలుపు తీసుకుంది అనేదే ఈ చిత్రం కథ. మరి హనిమూన్ కి ప్రియదర్శి , ఆనందితో ప్యారిస్ కి వెళ్లాడో లేదో తెలుసుకోవాలంటే జూలై 19 వరకు ఎదురు చూడాల్సిందే.అశ్విన్ రామ్ దర్శకుడు. వివేక్ సాగర్ సంగీతం సమకూర్చాడు.