భారత్ సమాచార్, విజయవాడ ;
విజయవాడలోని ఆంధ్రప్రదేశ్ ఫిషరీస్ యూనివర్శిటీ (ఏపీఎఫ్‌యూ) పరిధిలోని కళాశాలల్లో 2024–25 విద్యా సంవత్సరానికి సంబంధించి రెండేళ్ల డిప్లొమా కోర్సుల్లో అర్హత గల అభ్యర్థులకు ప్రవేశాలు కల్పిస్తోంది. ప్రభుత్వ కళాశాలల్లో మొత్తం 55 సీట్లు మాత్రమే ఉన్నాయి. విశ్వ విద్యాలయ అనుబంధ కళాశాలల్లో 440 సీట్లు అందుబాటులో ఉన్నాయి. కోర్సు వ్యవధి రెండు సంవత్సరాలు ఉంటుంది.ఆంగ్ల మాధ్యమంలో విద్యా బోధన ఉంటుంది. కోర్సులో చేరాలనుకునే అభ్యర్థులు కచ్చితంగా పదో తరగతి ఉత్తీర్ణత సాధించి ఉండాలి. 31.08.2024వ తేదీ నాటికి దరఖాస్తు చేయాలనుకునే అభ్యర్థులకు కచ్చితంగా 15 ఏళ్లు నిండి ఉండాలి.గరిష్టంగా 22 ఏళ్ల వయస్సు ఉండచ్చు. ఆన్ లైన్ ద్వారా మాత్రమే దరఖాస్తులు చేసుకోవాలి. ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభతేది: 10.06.2024 ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 26.06.2024 ఆలస్య రుసుముతో దరఖాస్తులకు చివరితేది: 29.06.2024.సర్టిఫికెట్ల ఎడిట్ ఆప్షన్: 2.07.2024,3.07.2024 వెబ్ ఆప్షన్ తేది: 06.07.2024. వెబ్‌సైట్: https://apfu.ap.gov.in