భారత్ సమాచార్, సినీ టాక్స్ : బాలీవుడ్ అగ్రహీరో కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ జవాన్ సినిమాతో మరో పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ హిట్ మూవీని తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ సినిమా ఆల్ ఇండియా లెవల్లో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామి కురిపిస్తోంది. అయితే తాజాగా షారూఖ్ ఖాన్ డూప్ గా నటించిన వ్యక్తి గురించి పలు ఆసక్తి విషయాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. కింగ్ ఖాన్ కు డూప్ గా నటిస్తున్న వ్యక్తి పేరు ప్రశాంత్ వాల్డె. ఈయన ఖాన్ కు డూప్ గా గత 15 ఏళ్ల నుంచి నటిస్తున్నట్టు తెలుస్తోంది.
రచయిత గాను రాణిస్తున్నాడు…
ప్రశాంత్ షారుఖ్ డూప్ అయినప్పటికీ రచయితగా, దర్శకుడిగా, నిర్మాతగా కూడా రాణిస్తున్నారు. అంటే ఆయన సంపాదన ఏం రేంజ్ లో ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు. తాజాగా ప్రశాంత్ వాల్టె ఓ మీడియాతో మాట్లాడుతూ..తాను గత 15 ఏళ్లు నుంచి షారుఖ్ సినిమాల్లో పనిచేస్తున్నట్లు తెలిపారు. ఇంక ఆయన రెమ్యూనరేషన్ విషయానికి వస్తే ఒక రోజు షూటింగ్‌లో పాల్గొంటే దాదాపు 30 నుంచి 40 వేలు తీసుకుండంటా. ఇంక సినిమా మొత్తం అయిపోయేసరికి కోటి రూపాయలకు పైనే అందుకుంటారని ఆయన తెలిపారు. ఈ లెక్కన చూస్తే ప్రశాంత్ వాల్టె ముంబాయిలో భారీగానే ఆస్తులు సంపాదించాడని బాలీవుడ్ టాక్.