Homemain slidesఏఐ బ్యూటీ ఐతానా నెల సంపాదన ఎంతో తెలుసా?

ఏఐ బ్యూటీ ఐతానా నెల సంపాదన ఎంతో తెలుసా?

భారత్ సమచార్, ఏఐ న్యూస్ : చూసిన వెంటనే పై ఫోటో లో ఉన్నది ఓక హాట్ బ్యూటీ అని మోసపోకండీ. అది ఒక ఏఐ మోడల్ రోబో. దాని పేరు ఐతానా. ప్రస్తుతం ప్రపంచమంతా కొత్త సాంకేతికతపై దృష్టి సారించింది. ఏఐ టెక్నాలజీ, వర్చువల్ రియాలిటీ.. లాంటి టెక్నాలజీలతో నూతన సమాజం వైపు కొత్త ఆవిష్కరణలు వెల్లువెత్తుతున్నాయి. వివిధ రంగాల్లో మనుషులతో సంబంధం లేకుండా ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్)ను ఉపయోగించడం సర్వసాధారణం అయ్యే రోజులు ఎంతో దూరంలో లేవు అంటే అందులో ఎంత మాత్రం ఆశ్చర్యం లేదు మరి. అయితే ఏఐ పై ఇప్పటికే మన సమాజంలోని  కొన్ని వర్గాల్లో చాలా వ్యతిరేకత కూడా వ్యక్తమవుతోంది. ఏఐ తో తమ ఉద్యోగాలకు ఎసరు రానుందని ఇప్పటికే చాలా మంది టెకీలు చాలా భయపడిపోతున్నారు. వాళ్లు అలా భయపడటానికి చాలా కారణాలు కూడా దోహదం చేస్తున్నాయి.

ఊహించని ఆదాయం వస్తోంది…

ఇదిలా ఉండగా స్పెయిన్ కు చెందిన ‘ద క్లూలెస్’ అనే ఏజెన్సీకి చెందిన రూబెన్ క్రూజ్ అనే వ్యక్తి ‘ఐతానా లోపేజ్’ అనే ఏఐ మోడల్ ను హ్యూమన్ రోబో ను డెవలప్ చేశాడు. ప్రస్తుతం ఈ ఏఐ మోడల్ పలు ప్రొడక్ట్స్ కు ప్రచారం చేస్తూ.. నెలకు రూ.3 లక్షల నుంచి రూ.9 లక్షల వరకు సంపాదిస్తోందట. ఐతానా సంపాదనపై రూబెన్ క్రూజ్ తెగ సంబురపడిపోతున్నాడు మరి. ప్రస్తుతం మోడల్స్, ఇన్ ఫ్లూయెన్సర్లతో ప్రకటనలు రూపొందించేందుకు భారీగా ఖర్చువుతోందని, వారితో వచ్చే క్రియేటివ్ సమస్యలతోనూ ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్పాడు. ఈ సమస్యలకు పరిష్కారంగా ఈ ఏఐ మోడల్ ను డెవలప్ చేశామని చెప్పుకొచ్చాడు. ఈ మోడల్ తమకు మంచి ఆదాయం తెచ్చిపెడుతోందని అంటున్నాడు. ఐతానాను ప్రకటనలు చూసి పలు కంపెనీలు తమ ఉత్పత్తులకు ప్రచారం చేయాలని వరుస కడుతున్నారని మురిసిపోతున్నాడు. అచ్చం యువతిలాగే ఉన్న ఐతానా చూసి నేటి ఏఐ జనరేషన్ యూత్ తమతో డేట్ కు రావాలని కూడా కోరుతుండడం విశేషమని రూబెన్ అంటున్నాడు. ఈ బేసిక్ మోడల్ లోనే ఇంత ఆదాయం సమకూరితే భవిష్యత్ లో దీన్ని మరింతగా డెవలప్ చేసి అత్యధిక ఆదాయం పెంచుకునే పనిలో ఉన్నాడు రూబెన్ క్రూజ్.

మరికొన్ని ఏఐ సంబంధిత కథనాలు మీకోసం…

డీప్ ఫేక్ బారి నుంచి ఇలా బయటపడుదాం

RELATED ARTICLES

Most Popular

Recent Comments