Homemain slidesసర్పంచ్ పదవికి అర్హతలెంటో తెలుసా?

సర్పంచ్ పదవికి అర్హతలెంటో తెలుసా?

భారత్ సమాచార్, రాజకీయం : అసెంబ్లీ ఎన్నికల సంగ్రామం ముగిసింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి.. తన మ్యానిఫెస్టో అమలుపై దృష్టి సారించింది. ఈ ఎన్నికల హడావిడి ఇప్పుడిప్పుడే తగ్గిపోతుండగా మరో 20-30 రోజుల్లో గ్రామ సంగ్రామం మొదలుకానుంది. అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల కంటే ఎక్కువ రాజకీయ కాక పుట్టించే సర్పంచ్ ఎన్నికలకు రంగం సిద్ధమైనట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఎన్నికల నిర్వహణకు అధికారులు చర్యలు తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. ఈమేరకు జనవరిలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించనున్నట్టు సమాచారం. డిసెంబర్ చివరి వారంలో షెడ్యూల్ రిలీజ్ చేసి, ఆ తర్వాత నోటిఫికేషన్ ఇవ్వనున్నారు. మూడు దశల్లో ఈ ఎన్నికలు నిర్వహించనున్నట్టు సమాచారం. ప్రస్తుతం సర్పంచ్, వార్డు సభ్యులకు సంబంధించి రిజర్వేషన్లు ఖరారుపై కసరత్తు నడుస్తోంది.

కాగా, గ్రామంలో పలుకుబడి బాగా ఉండే సర్పంచ్ పదవి కోసం ఎంతో మంది కలల కంటారు. ఇప్పుడిప్పుడే రాజకీయ జీవితాన్ని ప్రారంభించేవారు.., సర్పంచ్ పదవి నుంచి మొదలుపెట్టి భవిష్యత్ లో ఎమ్మెల్యే దాక వెళ్లాలని లక్ష్యం పెట్టుకున్నవారు.. తమ గ్రామాన్ని ప్రగతి పథంలో నడిపించాలనుకునే వారు సర్పంచ్ పదవికి పోటీ చేయాలని భావిస్తారు. అయితే వీరిలో అర్హతలపై కొన్ని సందేహాలు ఉంటాయి. ఏ అర్హతలు ఉంటాయో కింద చదవండి..

సర్పంచ్/వార్డు సభ్యుల పోటీ చేసే అభ్యర్థికి ఇద్దరి కంటే ఎక్కువ మంది సంతానం ఉంటే పోటీకి అనర్హులు.

  •  జూన్ 1, 1995 తర్వాత మూడో సంతానం ఉండకూడదు.
  • ఒక కాన్పులో ఇద్దరు లేదా ముగ్గురు పుడితే అర్హత.
  •  ఒక వ్యక్తికి ఇద్దరు పిల్లలు పుట్టాక మొదటి భార్య చనిపోతే, రెండో భార్యకు ఒకరు లేదా ఇద్దరు సంతానం కలిగితే భర్తకు పోటీ చేసే అర్హత ఉండదు. కానీ రెండో భార్యకు మాత్రం పోటీ చేసే అర్హత ఉంటుంది.
  • పోటీకి కనీస వయసు 21 ఏళ్లు
  •  పోటీ చేసే గ్రామ పంచాయతీలో ఓటరుగా నమోదై ఉండాలి.
  • రేషన్ డీలర్లు, సహకార సంఘాల వారు అర్హులు.
  •  స్థానిక సంస్థల్లోని ఉద్యోగులు, అంగన్‌వాడీ కార్యకర్తలు పోటీకి అనర్హులు.
  • దేవాదాయ సెక్షన్ 15 ప్రకారం ఏర్పాటు చేసిన సంస్థల్లోని వారు పోటీకి అనర్హులు.
  •  ప్రభుత్వం ద్వారా 25 శాతానికి మించి పెట్టుబడి కలిగిన సంస్థలు/కంపెనీల మేనేజింగ్ ఏజెంట్, మేనేజర్లు, సెక్రెటరీలు పోటీకి అనర్హులు.
  •  ప్రభుత్వ ఉద్యోగులు రాజీనామా చేసి ధ్రువీకరణను నామినేషన్ల పరిశీలనలోపు ఇస్తే అర్హులు.

పై అర్హతలు అన్నీ గతంలో ఎన్నికల సంఘం అమలు చేసినవి. ఈసారి ఎన్నికల్లో ఏవైనా చిన్న చిన్న మార్పులు ఉంటే ఉండవచ్చు. ప్రాథమిక అర్హతలు మాత్రం పైన సూచించినవే అని గమనించగలరు.

మరికొన్ని ప్రత్యేక కథనాలు…

మన దేశ చట్టాల్లో ఐదు ఆసక్తికరమైన అంశాలు…

RELATED ARTICLES

Most Popular

Recent Comments