Homemain slidesమళ్లీ ‘ఈ రోజుల్లో’...

మళ్లీ ‘ఈ రోజుల్లో’…

భారత్ సమాచార్, సినీ టాక్స్ ; టాలీవుడ్ లో ప్రస్తుతం ప్రతి శుక్రవారం కొత్త సినిమాలతో పాటుగా రీరిలీజ్ ల మూవీలు కూడా బారీగానే బాక్సాఫీస్ వద్ద విడుదలవుతున్నాయి. తాజాగా ప్రముఖ దర్శకుడు మారుతి దర్శకత్వం వహించిన మొదటి సినిమా ‘ఈ రోజుల్లో’ మూవీని రీరిలీజ్ కు సిద్ధం చేశారు దర్శక నిర్మాతలు. ఈ రొమాంటిక్ కామెడీ చిత్రాన్ని మార్చి 23 న మళ్లీ థియేటర్లలోకి తీసుకువస్తున్నారు. సరిగ్గా ఇదే రోజున 2012లో ఈ చిత్రం టాలీవుడ్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. చిన్న సినిమాగా విడుదలై బాక్సాఫీస్ వద్ద పెద్ద విజయాన్ని నమోదు చేసింది. శ్రీనివాస్, రేష్మా రాథోడ్, సాయి కుమార్ ప్రధాన పాత్రధారులు. జీవన్ బాబు సంగీతం సమకూర్చాడు. రూ.54 లక్షలతో నిర్మితమైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సూమారుగా రూ.12 కోట్ల కలెక్షన్ల వర్షం కురిపించింది. ఈ చిత్రంతో మారుతి ఉత్తమ తొలి చిత్ర దర్శకుడిగా సైమా అవార్డును గెలుచుకున్నాడు. ఇందులోని గీతాలు యూత్ ని బాగా ఆకట్టుకున్నాయి. ఈ మూవీ కన్నడలో ‘ప్రీతి ప్రేమ’ గా రీమేక్ అయింది.

మరికొన్ని సినీ సంగతులు…

‘లెజెండ్’ మూవీ రీరిలీజ్

RELATED ARTICLES

Most Popular

Recent Comments