భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

1, డిసెంబర్ 2025, సోమవారంభారత్ సమాచార్

నిరాశ్రయులకు చేయూత: దుప్పట్లు, భోజనం పంపిణీ

WhatsApp Image 2025-11-30 at 9.32.15 PM

భార‌త్ స‌మాచార్.నెట్, నిజామాబాద్ జిల్లా : బోధన్ పట్టణంలో చేయూత స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి నిరాశ్రయులు, యాచకులు, బీద కుటుంబాలకు దుప్పట్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. చలి తీవ్రతకు వణుకుతూ రోడ్డు పక్కన నిద్రిస్తున్న వారిని గుర్తించిన సంస్థ ప్రతినిధులు, వారికి దుప్పట్లతో పాటు భోజన ప్యాకెట్లను అందజేశారు. ఈ సేవా కార్యక్రమంలో పట్టణ సీఐ వెంకట్ నారాయణ, ఎస్సై భాస్కర్ చారి పాల్గొని స్వచ్ఛంద సేవకుల చర్యను ప్రశంసించారు.

 

చలికాలంలో ఇలాంటి కార్యక్రమాలు నిరాశ్రయులకు పెద్ద ఉపశమనం కలిగిస్తాయని నిర్వాహకులు పేర్కొన్నారు. చేయూత సంస్థ ప్రతినిధులు జాదవ్ ప్రవీణ్ నాయక్, ఉప్పరి శ్రీకాంత్, మంగలి భూమన్న, బంతిలాల్ నాయక్ తదితరులు ఈ సేవా కార్యక్రమంలో చురుకుగా పాలు పంచుకున్నారు.