భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

2, డిసెంబర్ 2025, మంగళవారంభారత్ సమాచార్

ABVP నూతన జాతీయ కార్యవర్గ సభ్యులుగా బోడ లక్ష్మణ్

8

భారత్ సమాచార్, మెదక్ జిల్లా: అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ABVP) 71వ జాతీయ మహాసభలు భగవాన్ బిర్సా ముండా నగర్, డెహ్రాడూన్, ఉత్తర్ఖండ్ రాష్ట్రంలో నవంబర్ 28 నుండి 30 తేదీలలో విజయవంతంగా పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా ఏబీవీపీ జాతీయ కార్యవర్గ సభ్యులు బోడ లక్ష్మణ్ మాట్లాడుతూ “ప్రతి సంవత్సరం కూడా ఇలాంటి మహాసభలు విద్యార్థి పరిషత్ దేశవ్యాప్తంగా ఒక్కొక్క రాష్ట్రంలో నిర్వహించడం జరుగుతుంది. ఈసారి ఈ జాతీయ మహాసభలకు 1,500 మంది ప్రతినిధులు దేశవ్యాప్తంగా పాల్గొనడం జరిగింది. ఈ సభలో జాతీయస్థాయిలో విద్యారంగం పైన జరుగుతున్న అవినీతి అక్రమాలపై తీర్మానం చేయడం జరిగింది. అదేవిధంగా నూతన జాతీయ కమిటీని కూడా ఎన్నుకోవడం జరిగింది. నాకు ఈ కమిటీలో బాధ్యత ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. నేను మహబూబాబాద్ జిల్లాకు చెందిన విద్యార్థిని. 2014 నుండి నాకు ABVP పరిచయం నేను B.COM,MSW పూర్తి చేశాను. 2014 నుండి కార్యకర్త,2019 నుండి పూర్తి సమయ కార్యకర్తగా పనిచేస్తున్నాను. గతంలో వరంగల్ మహానగర కార్యాలయ కార్యదర్శిగా, వాగ్దేవి నగర్ సహజోనల్ ఇన్చార్జిగా,జోనల్ ఇన్చార్జిగా,రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా, వరంగల్ మహానగర కార్యదర్శిగా, నల్గొండ నగర,జిల్లా సంఘటన మంత్రిగా, నల్గొండ,సూర్యపేట రెండు జిల్లాల సంఘటన మంత్రిగా, నల్గొండ విభాగ్ సంఘటన మంత్రిగా పనిచేశాను. ప్రస్తుతం ABVP మెదక్ విభాగ్ సంఘటన మంత్రి గా పని చేస్తున్నను.కేంద్రం సంగారెడ్డి ఈ 71 వ జాతీయ మహాసభలలో నాపై నమ్మకం ఉంచి నాకు జాతీయ కార్యవర్గ సభ్యులు బాధ్యత ఇచ్చిన జాతీయ అధ్యక్షుడు ప్రొఫెసర్ రఘురాజ్ కిషోర్ తివారి, బాలకృష్ణ జీ,శివకుమార్ జీ,డాక్టర్ మాసడి బాబురావు, రాష్ట్ర అధ్యక్షులు జానారెడ్డి, తోట లవన్, విష్ణు, రాజశేఖర్ గారికి, తెలంగాణ రాష్ట్ర కమిటీకి హృదయపూర్వక ధన్యవాదాలు” అని అన్నారు.