భారత్ సమాచార్, కర్నూలు జిల్లా: మాజీ ఎంపీ టీజీ వెంకటేష్‌ను ఆలూరు మాజీ మార్కెట్ యార్డ్ ఛైర్మన్ గుమ్మనూరు నారాయణ, నియోజకవర్గ బీజేపీ నాయకురాలు గుమ్మనూరు కమలమ్మ మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు అక్కమ్మ తోట రామకృష్ణ ఆధ్వర్యంలో వీరు టీజీ వెంకటేష్ స్వగృహంలో కలిసి పూల బొకే ఇచ్చి, శాలువాలతో సన్మానించారు. సీనియర్ బీజేపీ నేత కపిలేశ్వరయ్య కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ నెల 12న కర్నూలు పట్టణంలో నూతనంగా ఆవిష్కరించనున్న మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం సందర్భంగా ఈ సమావేశం జరిగిందని గుమ్మనూరు నారాయణ, కమలమ్మ తెలిపారు.
BHARATH SAMACHAR DIGITAL
3, డిసెంబర్ 2025, బుధవారంభారత్ సమాచార్