భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

4, డిసెంబర్ 2025, గురువారంభారత్ సమాచార్

నాగనాతీహళ్లి సమ్మర్ వాటర్ స్కీమ్ నీటి సమస్య పరిష్కారం

28

భారత్ సమాచార్, కర్నూలు జిల్లా: ఆలూరు తాలూకాకు చెందిన నాగనాతీహళ్లి సమ్మర్ వాటర్ స్కీమ్ నుండి ఆదోని మండలం ఐదు గ్రామాల వారు అక్రమంగా నీటిని వాడడం వల్ల ఆస్పరి మండలంలోని అనేక గ్రామాలకు నీటి సమస్య తలెత్తింది. ఈ సమస్యపై ఆలూరు తాలూకా టిడిపి ఇన్చార్జ్ వైకుంఠం జ్యోతిని సంప్రదించినట్లయితే, మేడం సానుకూలంగా స్పందించి సమస్యను త్వరలో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. సమస్య పరిష్కారమైతే ఆస్పరి మండలం గ్రామాలకు నీటి సౌకర్యం సులభతరం కానుందని తెలిపారు. ఈ సందర్భంలో ఆస్పరి మండలం ప్రజలు వైకుంఠం జ్యోతి గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నారు.