భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

4, డిసెంబర్ 2025, గురువారంభారత్ సమాచార్

త‌ప్పుడు ప్ర‌చారాన్ని ఖండించిన BRS యువజన నేత‌

WhatsApp Image 2025-12-03 at 7.59.18 PM

భార‌త్ స‌మాచార్.నెట్, నిజామాబాద్ జిల్లా : బోధన్ మండలం పెగడపల్లి గ్రామానికి చెందిన BRS యువజన మండల ఉపాధ్యక్షుడు మేడి రవి తనపై జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని ఖండించారు. తాను BRS పార్టీకే కట్టుబడి ఉన్నానని, కొందరు వ్యక్తులు వ్యక్తిగత దురుద్దేశాలతో తాను బీజేపీలో చేరినట్టుగా అసత్య వార్తలు ప్రచారం చేస్తున్నారని తెలిపారు.

 

కాంగ్రెస్ లేదా బీజేపీలో చేరాలనే ఆలోచన తనకు ఎప్పుడూ లేదని ఆయన స్పష్టం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్–BRS మధ్యే పోటీ ఉంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో BRS భారీ మెజారిటీతో గెలిచి కేసీఆర్ మరోసారి ముఖ్యమంత్రి అవుతారని రవి పేర్కొన్నారు. తప్పుడు ప్రచారాన్ని నమ్మవద్దని ఆయన పార్టీ శ్రేణులకు, ప్రజలకు పిలుపునిచ్చారు.