భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

6, డిసెంబర్ 2025, శనివారంభారత్ సమాచార్

కానుకుంటలో గోవర్ధన్ రెడ్డి ప్రచారం

WhatsApp Image 2025-12-05 at 5.48.54 PM

భారత్ సమాచార్, సంగారెడ్డి జిల్లా: గుమ్మడిదల మండలం కానుకుంట గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి యాదగిరి యాదవ్‌కు మద్దతుగా రాష్ట్ర నాయకులు చిమ్ముల గోవర్ధన్ రెడ్డి శుక్రవారం విస్తృత ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలతో భేటీ అయిన ఆయన.. గత బీఆర్ఎస్ పాలనలో గ్రామాలు సాధించిన అభివృద్ధిని, వివిధ సంక్షేమ పథకాల ద్వారా ప్రతి ఇంటికి చేరిన ప్రయోజనాలను వివరించారు. గ్రామాభివృద్ధి కొనసాగాలంటే బీఆర్ఎస్ అభ్యర్థి యాదగిరి యాదవ్‌ను గెలిపించాలని, తద్వారా గ్రామానికి మరిన్ని నిధులు, పథకాలు రాబట్టే అవకాశం కల్పించాలని గ్రామ ప్రజలను కోరారు. ఈ ప్రచారంలో కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, రాష్ట్ర నాయకులు వెంకటేశం గౌడ్, నాయకులు తదితరులు పాల్గొన్నారు.