భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

8, డిసెంబర్ 2025, సోమవారంభారత్ సమాచార్

జీపీవో నూతన కమిటీ ఎన్నిక

bfa6928f-bd51-40ae-899f-be980d8ed7f2

భారత్ సమాచార్, వనపర్తి జిల్లా: గ్రామపంచాయతీ ఆఫీసర్ (జీపీవో) జిల్లా ప్రధాన కార్యదర్శిగా మండల పరిధిలోని అన్నారం గ్రామానికి చెందిన సురేష్ కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు తెలిపారు. జీపీవోల రాష్ట్ర అధ్యక్షుడు ఉపేందర్ రావ్, ఉపాధ్యక్షుడు బచ్చలకూర పరమేశ్వర్ ఆదేశాల మేరకు జిల్లా కమిటీని ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడిగా ఆకుల శ్రీనివాసులు, ఉపాధ్యక్షులుగా శివారెడ్డి వెంకటన్న, ప్రధాన కార్యదర్శిగా సురేష్ కుమార్, కోశాధికారిగా మల్లేష్ మహిళా అధ్యక్షురాలుగా అంజమ్మను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా సురేష్ కుమార్ మాట్లాడుతూ.. జిల్లాలో జీపీవోల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. జిల్లా ప్రధాన కార్యదర్శిగా మండల వాసి సురేష్ కుమార్ ఎంపిక కావడంతో పలువురు అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో టిజిటిఏ జిల్లా అధ్యక్షుడు వనపర్తి తహసీల్దార్ రమేష్ రెడ్డి టిజిఆర్ఎస్ఏ డిప్యూటీ తహసీల్టార్ లక్ష్మీకాంత్, టీఎన్జీవో జిల్లా ఉపాధ్యక్షుడు మధుసూదన్ తదితరులు పాల్గొన్నారు.