భారత్ సమాచార్, యాదాద్రి భువనగిరి: సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రి పైనుంచి దూకి ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర కలకలం రేపింది. యాదగిరిగుట్ట మండలంలోని వంగపల్లి గ్రామానికి చెందిన నరేందర్ (37) అప్పుల బాధతో డిసెంబర్ 1న పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించగా, కుటుంబ సభ్యులు గాంధీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతున్న నరేందర్ సోమవారం తెల్లవారుజామున ఆస్పత్రి భవనం 3వ అంతస్తులోని బాత్రూం కిటికీ నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటనపై చిలకలగూడ పోలీసులు కేసు నమోదు చేశారు. నరేందర్ మృతితో స్వగ్రామం వంగపల్లిలో విషాదఛాయలు అలుముకున్నాయి.
BHARATH SAMACHAR DIGITAL
9, డిసెంబర్ 2025, మంగళవారంభారత్ సమాచార్