భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

9, డిసెంబర్ 2025, మంగళవారంభారత్ సమాచార్

ఎన్నికల ప్రచారానికి రేపటితో తెర

WhatsApp Image 2025-12-04 at 6.44.23 PM

భారత్ సమాచార్, మెదక్ జిల్లా: గ్రామ పంచాయతీ మొదటి విడత ఎన్నికలకు మంగళవారం సాయంత్రం 5 గంటలకు ప్రచారానికి తెరపడనున్నట్లు జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. పోలింగ్ ముగియడానికి 44 గంటల ముందు నుంచి ఆయా మండలాల్లో ‘సైలెన్స్ పీరియడ్’ అమలులోకి వస్తుందని ఆయన స్పష్టం చేశారు. ఈ సమయంలో ఎలాంటి బహిరంగ సభలు, ర్యాలీలు, ఊరేగింపులు, ఏ విధమైన ప్రచారాలు నిర్వహించరాదని కలెక్టర్ ఆదేశించారు. బయట నుంచి వచ్చిన వ్యక్తులు సంబంధిత గ్రామ పంచాయతీ పరిధిలో ఉండకూడదని తెలిపారు. ఎన్నికల ప్రక్రియ నిష్పక్షపాతంగా, పారదర్శకంగా జరిగేందుకు ప్రతి ఒక్కరూ ఎన్నికల సంఘం మార్గదర్శకాలు పాటించాలని, ఉల్లంఘనలు జరిగితే కఠిన చర్యలు తీసుకోవాలని నోడల్ అధికారులను కలెక్టర్ ఆదేశించారు.