భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

9, డిసెంబర్ 2025, మంగళవారంభారత్ సమాచార్

వందేమాతరం చరిత్రపై పార్లమెంట్‌లో ఎంపీ శబరి ప్రసంగం

WhatsApp Image 2025-12-08 at 8.13.09 PM

భారత్ సమాచార్.నెట్, నంద్యాల : నంద్యాల ఎంపీ, లోక్‌సభ టీడీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ డాక్టర్ బైరెడ్డి శబరి భారత పార్లమెంట్‌లో వందేమాతరం 150 ఏళ్ల చరిత్రను వివరిస్తూ అద్భుతంగా ప్రసంగించారు. ఈ అవకాశం కల్పించినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి ఆమె కృతజ్ఞతలు తెలిపారు.

 

వందేమాతరం పాటను శాశ్వత దేశభక్తి గీతంగా గుర్తించాలని ఆమె కోరారు. ఈ గీతం ఉద్భవం, స్వాతంత్ర్య పోరాటంలో దాని ప్రాధాన్యం, లక్షలాది ప్రజల గొంతు ద్వారా అది ప్రసిద్ధి పొందిన తీరును వివరించారు. ఈ గీతం మతం, కులం, జాతి భేదాలు లేకుండా ప్రతి భారతీయుడి హృదయాన్ని దేశభక్తితో నింపుతుందని ఆమె భరోసా ఇచ్చారు.