భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

10, డిసెంబర్ 2025, బుధవారంభారత్ సమాచార్

‘ప్రమాదకర ట్రాన్స్‌ఫార్మర్లకు కంచె వేయండి’

WhatsApp Image 2025-12-09 at 5.48.49 PM

భారత్ సమాచార్, కర్నూలు జిల్లా: దేవనకొండ మండల కేంద్రంలో ప్రజలకు ప్రమాదకరంగా మారిన విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లకు వెంటనే కంచె ఏర్పాటు చేయాలని సీపీఐ పట్టణ సహాయ కార్యదర్శి వి. రాజశేఖర్ డిమాండ్ చేశారు. విద్యార్థి, యువజన సంఘాల నాయకులతో కలిసి ట్రాన్స్‌ఫార్మర్లను పరిశీలించిన ఆయన, కంచె లేకపోవడంతో ప్రజలకు, ముఖ్యంగా పిల్లలకు, తీవ్రమైన ప్రమాదం పొంచి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. పత్తికొండ రోడ్డు, గ్రామపంచాయతీ కార్యాలయం, పాత ఎమ్మార్వో ఆఫీస్ వంటి అనేక ప్రాంతాలలో పరిస్థితి దారుణంగా ఉందని విమర్శించారు. అధికారులు వెంటనే స్పందించకపోతే, ప్రజల భద్రత కోసం పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని రాజశేఖర్ హెచ్చరించారు.