భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

11, డిసెంబర్ 2025, గురువారంభారత్ సమాచార్

అక్రమంగా తరలిస్తున్న మద్యం పట్టివేత

119c94db-ff1f-47d2-a665-b36cfaca695a

భారత్ సమాచార్, మెదక్ జిల్లా: నర్సాపూర్ మండల ఎఫ్‌ఎస్‌టీ టీమ్ ఇంఛార్జ్ ఏ.స్వప్న, నర్సాపూర్ నాయబ్ తహశీల్దార్, వారి టీమ్ సభ్యులు జీ. సుందర్రాజు, ఏఎస్సై నర్సాపూర్ మండలం లింగాపూర్ గ్రామశివారులో గల మెయిన్ రోడ్డు వద్ద వాహన తనిఖీ నిర్వహించారు. తనిఖీల్లో నర్సాపూర్ వైపు నుంచి ఓ ప్యాసింజర్ ఆటో ప్రభుత్వం నుంచి ఎటువంటి అనుమతులు, పత్రాలు లేకుండా, ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా 8 కాటన్ల (స్టెర్లింగ్ రిజర్వ్ బీ సెవెన్) క్వార్టర్ బాటళ్లను, మొత్తం 384 బాటిల్స్ తరలిస్తుండగా పట్టుకున్నారు. నర్సాపూర్ ఎస్సై ఏ.రంజిత్ కుమార్ రెడ్డి, ఎస్సై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.