భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

13, డిసెంబర్ 2025, శనివారంభారత్ సమాచార్

రెండో విడత ఎన్నికల్లో 100% ఓటింగ్ లక్ష్యం: కలెక్టర్

WhatsApp Image 2025-12-12 at 6.31.49 PM

భారత్ సమాచార్, మెదక్ జిల్లా: జిల్లాలో ఈ నెల 14న జరగనున్న రెండో విడత పంచాయతీ ఎన్నికలకు ఏర్పాట్లు పకడ్బందీగా జరుగుతున్నాయి. జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రాన్ని సందర్శించి, పంపిణీని ప్రణాళికాబద్ధంగా పూర్తి చేయాలని ఆదేశించారు. నూరు శాతం ఓటింగ్ లక్ష్యంగా ప్రజలు నిర్భయంగా ఓటింగ్‌లో పాల్గొనాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. ఎన్నికలు సజావుగా జరిగేందుకు సిబ్బందిని నియమించామని, వెబ్ కాస్టింగ్ ద్వారా పర్యవేక్షిస్తామని తెలిపారు. ఈ నెల 13న సిబ్బంది రిపోర్ట్ చేయాలన్నారు. పోలింగ్ ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు జరుగుతుందని, కౌంటింగ్ మధ్యాహ్నం 2 గంటల నుంచి మొదలవుతుందని తెలిపారు. అధికారులు పారదర్శకంగా విధులను నిర్వర్తించాలని కలెక్టర్ ఆదేశించారు.