భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

13, డిసెంబర్ 2025, శనివారంభారత్ సమాచార్

రెండో విడత సర్పంచ్ ఎన్నికల భద్రత ఏర్పాట్లపై ఎస్పీ స‌మీక్ష‌

WhatsApp Image 2025-12-12 at 8.39.04 PM

భారత్ సమాచార్.నెట్, సంగారెడ్డి : జిల్లాలో ఈ నెల 14న జరగనున్న రెండో విడత సర్పంచ్ ఎన్నికల భద్రత ఏర్పాట్లపై జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ సమీక్షా సమావేశం నిర్వహించారు. 10 మండలాల్లోని 229 స్థానాలకు ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు అన్ని చర్యలు తీసుకున్నట్లు ఆయన వివరించారు. సమస్యాత్మక కేంద్రాలను గుర్తించి నిఘా కట్టుదిట్టం చేశారు. గతంలో అల్లర్లు సృష్టించిన 1533 మందిని ముందస్తుగా బౌండ్ ఓవర్ చేశారు.

ఓటర్లు ఎలాంటి భయం లేకుండా స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోవాలని ఎస్పీ సూచించారు. డిసెంబర్ 12 సాయంత్రం 5 గంటల నుండి ‘సైలెంట్ పీరియడ్’ మొదలవుతుందని, సభలు, ప్రచారం నిషేధమని తెలిపారు. ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.