భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

13, డిసెంబర్ 2025, శనివారంభారత్ సమాచార్

ఆదోని జిల్లా ఏర్పాటుకు ఐఎంఏ మద్దతు

WhatsApp Image 2025-12-13 at 2.49.23 PM (1)

భారత్ సమాచార్, కర్నూలు జిల్లా: ఆదోని జిల్లా సాధన కోసం ఎమ్మిగనూరు పట్టణంలో కొనసాగుతున్న దీక్షకు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) ఎమ్మిగనూరు శాఖ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. దీక్ష నాలుగో రోజుకు చేరుకున్న సందర్భంగా ఐఎంఏ అధ్యక్షులు డాక్టర్ శిల్ప, సెక్రటరీ డాక్టర్ కార్తీక్‌తో పాటు సీనియర్ వైద్యులు శిబిరాన్ని సందర్శించి సంఘీభావం తెలిపారు. ఆదోని జిల్లా ఏర్పాటు వల్ల ప్రజలకు పరిపాలనా సౌలభ్యంతో పాటు మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయని వారు పేర్కొన్నారు. పరిపాలన వికేంద్రీకరణతోనే ఈ ప్రాంతం సమగ్రంగా అభివృద్ధి చెందుతుందని ఐఎంఏ నాయకులు అభిప్రాయపడ్డారు. వైద్యులు మద్దతు ప్రకటించడంతో ఆదోని జిల్లా సాధన పోరాటం మరింత బలం పుంజుకుంది.